MS Dhoni: రుతురాజ్‌ను వెన్నుపోటు పొడిచిన ధోనీ.. ఇంత పని చేశావ్‌ మహీ భాయ్..!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ధోని కెప్టెన్సీ అంటే వేరే రేంజ్ అని ఇప్పటికే చెప్పకనే చెప్పారు.

Update: 2025-04-11 08:51 GMT
Ruturaj Gaikwad MS Dhoni Backstabbing KKR vs CSK

MS Dhoni: రుతురాజ్‌ను వెన్నుపోటు పొడిచిన ధోనీ.. ఇంత పని చేశావ్‌ మహీ భాయ్..!

  • whatsapp icon

MS Dhoni: అయిపోయింది... అంతా అయిపోయింది... ఈ సీజన్ మనదే కాదని నిరాశలో మునిగిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒక్కసారిగా హై వోల్టేజ్ న్యూస్ చెప్పారు. ఎల్బో గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ టోర్నమెంట్‌కి దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో అందరి ఫేవరెట్ అయిన మహేంద్ర సింగ్ ధోనిని జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. దీంతో ఒక్క చెన్నైలో కాదు, దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. డీలా పడ్డ చెన్నై జట్టుకు ఈ వార్త నిజంగా పెద్ద బూస్ట్. ధోని అంటే సీఎస్‌కే, సీఎస్‌కే అంటే ధోని అని ఫ్యాన్స్ సోషల్ మీడియా మీద ఊగిపడుతున్నారు.

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ధోని కెప్టెన్సీ అంటే వేరే రేంజ్ అని ఇప్పటికే చెప్పకనే చెప్పారు. ఆయన మాటలే నిజమయ్యాయి అని చెబుతూ చెన్నై యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన తరువాతే రుతురాజ్‌ను పక్కన పెట్టారా అనే అనుమానం ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది. ఇక ఇంట్రెస్టింగ్‌గా చూస్తే, అయిదు మ్యాచ్‌ల్లో ఎల్బో ఇంజురీ కనిపించకుండా ఇప్పుడు ఒక్కసారిగా బయటపడటం మీద అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. ఇది పూర్తిగా ధోని వేసిన మాస్టర్ ప్లాన్‌నే అని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. గతంలో కూడా చెన్నై చాలా మ్యాచ్లు ఓడిపోయింది, కానీ ఈసారి వచ్చిన విమర్శలు, ట్రోల్స్, ఆరోపణలు మునుపెప్పుడూ లేవు. అందుకు కారణం ధోని ఆటతీరే. అతని నెమ్మదిగా ఆడే టుక్ టుక్ బ్యాటింగ్ టీ20 ఫార్మాట్‌ను కూడా బోర్ చేస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఫస్ట్ టైమ్ ఫ్యాన్స్ నుంచే నువ్వు మాకు వద్దు, వీలైతే వెంటనే జట్టును వదిలేయి అనే రీతిలో స్పందనలు రావడం అతని కెరీర్‌లో అరుదైన పరిణామం. గతంలో చెన్నై మ్యాచ్ అంటే ఇంటి వేదికలాంటి అనుభూతి కలిగే ఫ్యాన్స్ ఇప్పుడు డీలా పడిపోవడం చూసి ధోని తనపై వస్తున్న ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నంలోనే రుతురాజ్‌ను పక్కన పెట్టాడని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే ధోని నిజంగా మాస్టర్ మైండ్ అన్న మాట సరైనదే. ఎందుకంటే వచ్చే మ్యాచ్‌ల్లో టాస్‌కి ధోని నడుచుకుంటూ వచ్చిన ప్రతిసారీ కామెంటేటర్లు స్పెషల్ హైప్ తీసుకురావడం ఖాయం. అలాంటప్పుడు ఫ్యాన్స్ మళ్లీ ఫిదా కావడం సహజమే.

మరోవైపు ధోని ఒక అద్భుతమైన కెప్టెన్, అతను సాధించిన టైటిల్స్‌నే ఆ విషయం రుజువు చేస్తాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో చెన్నై కొత్త ఎనర్జీతో బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు. కానీ జట్టులో ఉన్న లోపాలు కేవలం కెప్టెన్ మారడంతో సరిచేయలేవు. టాప్ ఆర్డర్ వైఫల్యం, మిడిల్ ఆర్డర్‌లో నమ్మకమైన బ్యాట్స్‌మెన్ లేకపోవడం, బౌలింగ్ డీసెంట్‌గా ఉన్నా డెత్ ఓవర్లలో ప్రభావం చూపించలేకపోవడం, ఫీల్డింగ్‌లో తడబాట్లు ఇవన్నీ కూడా చెన్నై తలపడుతున్న అసలైన సమస్యలు. మరి ఇప్పుడు ధోని కెప్టెన్‌గా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

Tags:    

Similar News