IPL 2025: ఐపీఎల్ మ్యాచ్‌లు ఫిక్స్ అవుతున్నాయా? పెరుగుతున్న అనుమానాలు!
IPL 2025: ఇలా ఎవరి వాదన వారిదే అయినా సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లోనూ అంపైరింగ్ ఫాల్ట్ కనిపించడం బిగ్ డిబెట్‌కు కారణమైంది.

IPL 2025: ఐపీఎల్ మ్యాచ్‌లు ఫిక్స్ అవుతున్నాయా? పెరుగుతున్న అనుమానాలు!
IPL 2025: హైదరాబాదీ బిజినెస్ మ్యాన్ ఫిక్సింగ్‌కు పాల్పపడుతున్నదంటూ మొన్ననే బీసీసీఐ IPL ఫ్రాంచైజీలను హెచ్చరించింది. దీంతో IPL అంటేనే ఫిక్సింగ్, అసలు ఆట నిజం కాదని నమ్మే హ్యాటెర్స్‌కి ఈ వార్త మంచి కిక్కునిచ్చింది. సాఫీగా సాగుతున్న ఈ టోర్నమెంట్‌లో మాకు ఈ గొడవేంట్రా బాబు అని IPL జట్లు అనుకుంటూ ఉండగానే.. ముంబై ఇండియన్స్ కారణంగా మళ్ళీ ఫిక్సింగ్ దుమారం రాజుకుంటోంది. సన్‌రైజర్స్‌తో తమ కంచుకోట అయిన వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నీతా అంబానీ అంపైర్‌ని కొనేశారంటూ ఆరంజ్ ఆర్మీ గోల పెడుతున్నారు. ముంబై జట్టుపై ఈ ఆరోపణ రావడం ఇదేమి కొత్త కాదు. ప్రతి ఏడాది IPL అంపైర్లు ఇచ్చే కొన్ని నిర్ణయాలు కాంట్రవర్సీ కి దారి టీయడం ఆనవాయితీ. అయితే, ఈ కాంట్రోవర్సియల్ డెసిషన్స్ కేవలం ముంబై ఇండియన్స్ కి అనుకూలంగా ఉండటం, అంపైర్‌లు ముంబై బ్యాటర్లకు సాఫ్ట్ కార్నెర్ చూపించడం, ఇదంతా IPL షరా మామూలే! అయితే నిజానికి ముంబైకే కాదు.. అంపైరింగ్ ఎర్రర్స్ ఇతర జట్లకు కూడా జరుగుతాయి. కానీ ముంబై ఐదుసార్లు ట్రోఫీ గెలవడంతో వారిపై జనరెల్‌గానే ఇతర జట్ల ఫ్యాన్స్‌కు కుళ్లు ఉంటుంది. ఇలా ఎవరి వాదన వారిదే అయినా సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లోనూ అంపైరింగ్ ఫాల్ట్ కనిపించడం బిగ్ డిబెట్‌కు కారణమైంది.
నిజానికి ఈ మ్యాచ్‌లో ముంబై ఫీల్డింగ్‌లో తడబడింది. అయినా కూడా సన్ రైజర్స్ జట్టును తక్కువ స్కోర్‌కి కట్టడి చేయగలిగిన ఇండియన్స్, బ్యాటింగ్ లో కొంత తడబడినా, మ్యాచ్ మాత్రం గెలిచేశారు. కానీ ముంబై జట్టు అంటే కొంతైనా డ్రామా ఉండాల్సిందేగా మరి. అందుకే, అంపైర్ నేను సృష్టిస్తా డ్రామా ఉండండి అంటూ... కమ్మిన్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన రికెల్టెన్‌ని వెనక్కి పిలిచాడు. నువ్ బ్యాటింగ్ ఆడు బాబు, అసలు అవుటే కాలేదు నువ్వు అన్నట్టు డిక్లేర్ చేసాడు. విషయంలోకి వెళ్తే.. సన్ రైజర్స్ బౌలర్ జీషాన్ అన్సారీ వేసిన బంతిని కవర్స్ మీదుగా బౌండరీకి తరిలిద్దాం అనుకున్న రికెల్టెన్.. కమ్మిన్స్ కి దొరికిపోయాడు. డైవ్ చేసి మరి క్యాచ్ పట్టిన కమ్మిన్స్..హమ్మయ్య ఇక్కడ్నుంచి మ్యాచ్ మనవైపు కి తిరుగుతుంది అనుకున్నాడు. తర్వాత బాట్స్మన్ సూర్య కుమార్ యాదవ్ క్రీజ్ లోకి వచ్చి, నెక్ట్స్ బాల్ ఎదురుకోవడానికి సిద్దమవుతుండగానే, అంపైర్ రికల్టెన్‌ను వెనక్కి పిలవాలని ఆర్డర్ వేశాడు. కారణం.....జీషాన్ బౌలింగ్ వేస్తున్నప్పుడే.... వికెట్ కీపర్ హెన్రిక్ క్లాస్సేన్ స్టంప్స్ పైన గ్లౌసెస్ తో రెడీ గా ఉండటం.
రూల్ ప్రకారం, వికెట్ కేపేర్ తన స్టాన్స్ ని స్టంప్స్ వెనకాలే ఉండేలా చూసుకోవాలి.. కానీ అప్పుడప్పుడు ఎంతో మంది కీపర్ లు తమకి తెలియకుండానే, బాల్ ని క్యాచ్ చేయాలి అన్న ఉద్దేశం తో స్టంప్స్ దాటి పెట్టేస్తుంటారు. ఇది కెమెరా లో రికార్డు అయినా, అంపైర్ లు టైం కి చూసి, వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడు జరగలేదు. సన్ రైజర్స్ దురదృష్టానికి నిన్న, అందులోను ఇంపార్టెంట్ వికెట్ పడిన బాల్ ని.. క్లాస్సేన్ చీట్ చేశాడంటూ అంపైర్ నో బాల్ బాల్ గా డిక్లేర్ చేసి, ర్యాన్ రికెల్టన్ ని వెనక్కి పిలిపించి, ఫ్రీ హిట్ డిక్లేర్ చేసాడు. అంతే, సన్ రైజర్స్ అభిమానుల కోపానికి అంతు లేకుండా పోయింది. దీంతో అంపైర్ ని కూడా ఎడా పెడా తిట్టడం మొదలుపెట్టారు. క్లాస్సేన్ చేసింది తప్పే అయినా, డెడ్ బాల్‌గా డిక్లేర్ చేయాలి గాని, నో బాల్ ఇవ్వడం ఏంటి అంపైర్ మహాశయా...అంటూ సోషల్ మీడియా లో ఎక్స్‌పర్ట్స్ కూడా వాపోతున్నారు. నిజానికి MCC రూల్స్ ప్రకారం అది నో బాలే! అయితే అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే సన్ రైజర్స్ ఓడిపోయారా అంటే...కాదు. కానీ, పలు మార్లు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు చేసిన తప్పుల్ని పట్టించుకోని అంపైర్లు, వేరే జట్లు ఏతప్పులు చేస్తే మాత్రం ఇట్టే పసిగట్టడం ఎంత వరకు న్యాయమని ఫాన్స్ కడిగిపారేస్తున్నారు.