MS DHONI: రిటైర్‌మెంట్‌ గురించి ధోనీ షాకింగ్‌ కామెంట్స్‌.. ఊహించని ట్విస్ట్!

MS DHONI: ఐపీఎల్ 2025కు ముందే జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ తాను ఇప్పుడు కేవలం క్రికెట్‌ను ఆనందించే దశలో ఉన్నానని చెప్పాడు. చిన్నప్పటి ఆటపటాల్లో ఉన్న ఆ అమాయకత్వాన్ని మళ్లీ మానసికంగా తలుచుకుంటూ ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు.

Update: 2025-04-06 12:01 GMT
MS DHONI

MS DHONI: రిటైర్‌మెంట్‌ గురించి ధోనీ షాకింగ్‌ కామెంట్స్‌.. ఊహించని ట్విస్ట్!

  • whatsapp icon

MS DHONI: చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎమ్‌ఎస్ ధోనీ తన ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందించాడు. గత కొద్ది రోజులుగా ధోనీ రిటైర్ అవతాడన్న ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో, అతను స్పష్టత ఇచ్చాడు. మైదానంలో ధోనీ తల్లిదండ్రులు కనిపించడం, ఆయన భార్య సాక్షి మైదానంలో కూతురు జీవాకు 'లాస్ట్ మ్యాచే' అని చెబుతుండటం ఈ చర్చలకు ఊపునిచ్చాయి. కానీ తాజాగా రాజ్ షమాని నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ధోనీ తన భావాలు వివరించాడు.

ఈ సీజన్‌తోనే ఆటకి గుడ్‌బై చెబుతానన్న ఉద్దేశం తనకు లేదని ధోనీ క్లియర్‌గా చెప్పాడు. తన శారీరిక స్థితిని బట్టి ప్రతి ఏడాది ఒకసారి నిర్ణయం తీసుకుంటానన్నది ధోనీ మాట. వచ్చే సంవత్సరం తన శరీరం సహకరిస్తే, ఇంకొక ఏడాది ఆడతానని, కానీ అంతా శరీరమే నిర్ణయిస్తుందన్నది ధోనీ స్పష్టతనిచ్చాడు.

ప్రస్తుతం ధోనీ వయసు 43. ఆ తరువాతి పదినెలల్లో తన శరీరం ఎలా స్పందిస్తుందో చూసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటానన్నాడు. అనవసరంగా తాను ముందుగా ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదని చెప్పాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ధోనీ భవిష్యత్‌పై మీడియా ప్రశ్నించగా, సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా అదే తీరులో స్పందించాడు. ధోనీతో రిటైర్మెంట్ గురించి ఇప్పుడేమీ మాట్లాడడం లేదని, అతడు ఇంకా బలంగా ఉన్నాడని, తనూ ప్రస్తుతానికైతే ఆ విషయంలో ఏనాడూ అడగడం మానేశానన్నాడు.

Tags:    

Similar News