KL Rahul: ఎవడ్రా టుక్ టుక్ బ్యాటర్..? ఇప్పుడు దమ్ముంటే నా ముందుకు రండి!
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లోనే 185 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 170కి చేరటం చూస్తే, అతని ధోరణి ఎలా ఉందో అర్థమవుతుంది.

KL Rahul: ఎవడ్రా టుక్ టుక్ బ్యాటర్..? ఇప్పుడు దమ్ముంటే నా ముందుకు రండి!
KL Rahul: ఎవడ్రా టుక్ టుక్ బ్యాటర్..? ఇప్పుడు దమ్ముంటే నా ముందుకొచ్చి ఆ మాట అనండి..! యే బిడ్డా.. ఇది నా అడ్డా..! అవును..! కేఎల్ రాహుల్ మండిపోయి ఉన్నాడు. తనకు ఎంతగానో ఇష్టమైన బెంగళూరు గడ్డపై రెచ్చిపోయి ఆడాడు. కోహ్లీ గ్యాంగ్‌ను మట్టికరిపించాడు. వేలంలో తనను ఆర్సీబీ తీసుకోలేదని గతంలో ఎంతో బాధపడ్డ రాహుల్.. ఇప్పుడు మాత్రం తనని నమ్మిన ఢిల్లీ జట్టును ముందుండి గెలిపించాడు. ఓడిపోయే మ్యాచ్‌లో ఢిల్లీకి విక్టరీ అందించిన రాహుల్.. విన్నింగ్ షాట్ తర్వాత సెలబ్రేట్ చేసుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. గ్రౌండ్‌లో చాలా సౌమ్యంగా కనిపించే రాహుల్.. తన స్టైల్ బూతు డైలాగ్‌తో బెంగళూరు ఫ్రాంచైజీ చెంపచెల్లుమనిపించాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులతో చెలరేగిన రాహుల్ దెబ్బకు చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ చిన్నబోయింది.
పిచ్ పరిస్థితులను బట్టి మొదట మెల్లగా ఆడిన కేఎల్ రాహుల్, ఆ తర్వాత ఒక్కసారిగా షాట్ల వర్షం కురిపించాడు. అతడి జాగ్రత్తతో మొదలైన ఇన్నింగ్స్ చివరికి విధ్వంసంగా మారింది. ఈ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచింది. గెలిచిన వెంటనే రాహుల్ చేసిన సెలబ్రేషన్ ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. మ్యాచ్‌ను ఓ సిక్సర్‌తో ముగించిన తర్వాత, రాహుల్ ఆగ్రహంతో అభిమానం చూపించాడు. స్టేడియంలోని అభిమానుల్ని ఉద్దేశించి బ్యాట్‌తో సంకేతాలు చేస్తూ, ఇది తన చోటు అనే అర్థమొచ్చేలా ప్రవర్తించాడు. తన షాట్ల ద్వారా ఈ మైదానంపై తనకు ఎంత అవగాహన ఉందో చాటిచెప్పాడు. ఈ ప్రదర్శనకే రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం రాహుల్ స్పందిస్తూ ఇది ట్రిక్కీ పిచ్ అని, తాను 20 ఓవర్లు కీపింగ్ చేసిన అనుభవం బాగా ఉపయోగపడిందన్నాడు. మొదట ఓ స్టెడీ ఆరంభం అవసరమన్న ఆలోచనతోనే ఆడానని చెప్పాడు.
ఈ మ్యాచ్ రాహుల్‌కు ఒక రివెంజ్ గేమ్ లా మారింది. 2022 నుంచి 2024 వరకు లక్నోకు కెప్టెన్‌గా ఉన్న రాహుల్, రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కి జట్టును తీసుకెళ్లాడు. కానీ 2024లో ఓనర్లతో విభేదాలు వచ్చాయి. అదే సంవత్సరం ఆయన 520 పరుగులు చేయగా, స్ట్రైక్ రేట్ 136. అయినా, ఓ ఓటమి తర్వాత లక్నో ఓనర్ గ్రౌండ్ లోనే అతనిపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ ఘటన అభిమానుల్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. తర్వాత రాహుల్‌ను జట్టు విడిచిపెట్టింది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే రాహుల్ ఢిల్లీ తరఫున అద్భుత ప్రదర్శన ఇస్తూ ఉంటే, లక్నోకు గట్టిగా బుద్ధిచెప్పినట్టే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లోనే 185 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 170కి చేరటం చూస్తే, అతని ధోరణి ఎలా ఉందో అర్థమవుతుంది.