Delhi Capitals: ఐపిఎల్ 2025 మధ్యలో బ్రేక్ తీసుకుని మాల్దీవ్స్ వెళ్లిన మెంటార్
Delhi Capitals mentor Kevin Pietersen's Maldives trip: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెంటార్ కెవిన్ పీటర్సన్ బ్రేక్

Delhi Capitals: ఐపిఎల్ 2025 మధ్యలో బ్రేక్ తీసుకుని మాల్దీవ్స్ వెళ్లిన మెంటార్
Kevin Pietersen takes Maldives flight amid IPL 2025: ఐపిఎల్ 2025 నడుస్తుండగానే ఇంగ్లాండ్ క్రికెట్ లెజెండ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెంటార్ కెవిన్ పీటర్సన్ చిన్న బ్రేక్ తీసుకుని మాల్దీవ్స్ వెళ్లాడు. శనివారం చెన్నై స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరింత జోష్ వచ్చేసింది. అందుకే ఆ జోష్‌ను ఎంజాయ్ చేసేందుకు పీటర్సన్ మాల్దీవ్స్ ఫ్లైట్ ఎక్కాడు.
ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ ఆడనుంది. కానీ ఈ మ్యాచ్‌కు కెవిన్ పీటర్సన్ అందుబాటులో ఉండటం లేదు. ఏప్రిల్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రాక్టీస్ సమయానికి పీటర్సన్ మాల్దీవ్స్ టూర్ ముగించుకుని ఢిల్లీకి రానున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో అన్ని మ్యాచ్‌లు గెలిచింది. ఆరంభంలోనే లక్నో సూపర్ జెయింట్స్, ఆ తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్, చిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఢిల్లీ చేతిలో ఓడిపోయాయి.
ఈ ఐపిఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ సమిష్టిగా రాణిస్తున్నారు. ఫాపు డూప్లెసిస్ ఫిట్‌గా లేకపోవడంతో శనివారం ఇన్నింగ్స్ ప్రారంభించిన కే.ఎల్. రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బౌలర్స్ మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదు కనుకే మెంటార్ కెవిన్ పీటర్సన్ సరదాగా అలా మాల్దీవ్స్ ట్రిప్‌కు వెళ్లాడు. లేదంటే జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్లే వాడు కాదుగా.
ఛాలెంజర్స్‌తో ఛాలెంజింగ్ మ్యాచ్
ఢిల్లీ క్యాపిటల్స్ చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తరువాతి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీకి నిజంగానే కొంచెం ఛాలెంజింగ్ మ్యాచ్ కానుంది. ఎందుకంటే బౌలర్స్‌కు చిన్న స్వామి స్టేడియం ఎప్పుడూ కఠినమైనదే అనే పేరుంది. బెంగళూరు జట్టుకు హోం గ్రౌండ్ కావడంతో వారికి ఆ పిచ్ అలవాటే. కానీ ఢిల్లీ బౌలర్ల పరిస్థితే ఏంటనేది మ్యాచ్ మొదలైతే కానీ తెలిసే ఛాన్స్ లేదు. కాకపోతే ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అది అంత పెద్ద సమస్య కూడా కాకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.