IPL 2021: ఐపీఎల్ లో ఆడనున్నడేవిడ్ వార్నర్
IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆడనున్నట్లు తెలుస్తోంది.
IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆడనున్నట్లు తెలుస్తోంది. గజ్జల్లో గాయం ఏర్పడిందపి దాన్నుంచి కోలుకోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వార్నర్ సోమవారం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు అతడు అందుబాటులో ఉండడని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా తన గాయంపై వార్నర్ స్పష్టత ఇచ్చాడు. గాయం తీవ్రత మరో కొన్ని నెలలు ఉంటుందని, అప్పటివరకు మైదానాన్ని వీడాల్సిన అవసరం లేదని తెలిపాడు. వచ్చే నెలలోనే బరిలోకి దిగుతున్నట్లు ట్వీట్ చేశాడు.