CSK vs DC match: 25 పరుగుల తేడాతో చెన్నై ఓటమి... విజయ్ 69 పరుగులు వృధా.. ధోనీ స్కోర్ ఎంతంటే...
CSK vs DC match highlights and review: చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్

CSK vs DC match: 25 పరుగుల తేడాతో చెన్నై ఓటమి... విజయ్ హాఫ్ సెంచరీ వృధా.. ధోనీ స్కోర్ ఎంతంటే...
CSK vs DC match Highlights: ఐపిఎల్ 2025 లో భాగంగా చిదంబరం స్టేడియంలో జరిగిన 17వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులకే ఆలౌట్ అయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయడంలో కే.ఎల్. రాహుల్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ జేక్ ఫ్రేసర్ డకౌట్ అయినప్పటికీ, రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు (6 ఫోర్లు, 3 సెక్సులు) చేసి స్కోర్ వేగం పెంచాడు. రాహుల్‌కు అభిషేక్ పొరేల్ 20 బంతుల్లో 33 పరుగులు జోడించాడు. అక్షర్ పటేల్ (21), సమీర్ రిజ్వి (15), ట్రిస్టాన్ స్టబ్స్ (24) పరుగులతో జట్టు టోటల్ స్కోర్‌ను ఇంకొంత ముందుకు తీసుకెళ్లారు.
ఢిల్లీ క్యాపిటల్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మెద్ (2/25) మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ముఖేష్ చౌదరి ఒక్క వికెట్ కూడా తీయకుండా 50 పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మెద్, మతీష పతిరానా చెరో వికెట్ తీశారు.
184 పరుగుల విజయ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరంభంలోనే చతికిలబడింది. 2 ఓవర్లు కూడా పూర్తి అవకుండానే ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర 3 పరుగులకే ఔట్ అయ్యాడు.
ఆ తరువాతి ఓవర్‌లో 3 బంతులకే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ కూడా 5 పరుగుల స్వల్ప వ్యక్తిగత స్కోర్ వద్దే వికెట్ కోల్పోయాడు. అలా 20 పరుగులకే చెన్నై జట్టు 2 కీలకమైన వికెట్స్ కోల్పోయింది.
విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో 5.3 ఓవర్ల వద్ద ఓపెనర్ డెవోన్ కాన్వే (14 బంతుల్లో 13 పరుగులు) కూడా ఔట్ అయ్యాడు. కాన్వే హిట్ ఇచ్చిన బంతిని అక్షర్ పటేల్ ఎక్స్‌ట్రా కవర్‌లో సింపుల్ క్యాచ్ పట్టాడు. జట్టు స్కోర్ 41 ఉండగానే చెన్నై జట్టు 3 వికెట్లు లాస్ అయింది.
శివం దూబే (18), రవీంద్ర జడేజా (2) పరుగులకే ఔట్ అయినప్పటికీ విజయ్ శంకర్ 54 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్‌గా తుది వరకు పోరాడాడు.
74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తరువాత మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి చెన్నై గెలవడానికి 56 బంతుల్లో 110 పరుగులు చేయాల్సి ఉంది. 26 బంతుల్లో 30 పరుగులు చేసిన ధోనీ కూడా నాటౌట్‌గానే మిగిలాడు. నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులే చేయడంతో చెన్నై జట్టు ఢిల్లీ చేతిలో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. విజయ్ శంకర్ పోరాటం వృధా అయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ (2/27) తో రాణించాడు. మిచెల్ స్టార్క్, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
పాయింట్స్ పట్టికలో DC vs CSK
ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచ్‌లు ఓడిపోయి ఐపిఎల్ 2015 పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 పాయింట్స్‌తో నెంబర్. 1 ర్యాంక్‌లో ఉంది.
ఈ మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవికా దేవి, భార్య సాక్షి, కూతురు జివా అటెండ్ అయ్యారు. దీంతో ధోనీ రిటైర్ (MS Dhoni's retirement news) అవుతున్నారా అనే ఊహాగానాలు కూడా వినిపించాయి.