IPL History: ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'.. అన్ని టీమ్స్ బిడ్ వేసిన ఏకైక ప్లేయర్ ఎవరో తెలుసా?
IPL History: 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎనిమిది ఫ్రాంచైజీలతో లీగ్‌ను మొదలెట్టింది.
IPL History: 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎనిమిది ఫ్రాంచైజీలతో లీగ్‌ను మొదలెట్టింది. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్.. లాంటి ఆటగాళ్లకు మంచి క్రేజ్ ఉంది. అదే సమయంలో 2007లో టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కూడా ఫాలోయింగ్ వచ్చింది. దాంతో మహీని కొనేందుకు ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. అన్ని టీమ్స్ బిడ్ వేయగా.. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీకి సొంతమయ్యాడు.
2008లో వేలంకు ముందు ఫ్రాంచైజీలకు స్థానిక ఆటగాళ్లను (ఐకాన్ ప్లేయర్) ఎంచుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కోల్‌కతా నైట్ రైడర్స్, ది వాల్ రాహుల్ ద్రవిడ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వీరేంద్ర సెహ్వాగ్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ ఎంచుకున్నాయి. ఐకాన్ ప్లేయర్‌కు ప్రాంచైజీ తీసుకునే ఆటగాళ్లలో గరిష్ట ధర కంటే 15 శాతం ఎక్కువగా ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఝార్ఖండ్‌కు ఐపీఎల్ టీమ్ లేకపోవడంతో ఎంఎస్ ధోనీ వేలంలోకి వచ్చాడు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీకి ఐకాన్ ప్లేయర్ లేడు. కాబట్టి ధోనీని వేలంలో తీసుకోవాలని చెన్నై ఫిక్స్ అయింది. వేలంలోకి మహీ కోసం 8 టీమ్‌లు బిడ్ వేశాయి. అన్ని టీమ్‌లు పోటీ పడడంతో ధర రూ.7 కోట్లు దాటింది. అప్పట్లో ఈ మొత్తం చాలా పెద్దది. ఆరు జట్లు డ్రాప్ అయ్యాయి. చివరకు రేసులో చెన్నై, ముంబై నిలిచాయి. చెన్నై ఓనర్ శ్రీనివాసన్, ముంబై ఓనర్ ముకేశ్ అంబానీలు తగ్గక పోవడంతో ధర రూ.12 కోట్లకు చేరింది. అప్పటికే ముంబై పర్స్ వాల్యూ చాలా తక్కువగా ఉంది. ధోనీకి ఎక్కువ మొత్తం వెచ్చిస్తే.. సచిన్‌కు ఇంకా 15 శాతం ఎక్కువ ఇవ్వాలి. ఇది గ్రహించిన ముంబై డ్రాప్ అయింది. దాంతో ధోనీ చెన్నై సొంతమయ్యాడు.
2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ వేలంలో ఎంఎస్ ధోనీ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఇప్పటికీ 17 సీజన్లు ముగిసి, 18వ సీజన్‌కు సిద్దమవుతున్నా.. ఏ ప్లేయర్ కోసం అన్ని ప్రాంఛైజీలు ఒకేసారి బిడ్ వేయలేదు. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'గా ధోనీ కొనసాగుతున్నాడు. 2008 నుంచి చెన్నై తరఫునే అతడు ఆడుతున్నాడు. చెన్నై ప్రాంచైజీపై రెండేళ్ల నిషేదం పడినపుడు మాజీ భారత కెప్టెన్ 2016, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడాడు. చెన్నైకి ఏకంగా ఐదు ట్రోఫీలు అందించాడు. ఐపీఎల్ 2025లో కూడా ఆడేందుకు సిద్దమయ్యాడు.