ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన "శ్రీ" కారం రాస్తారెందుకు?

Update: 2019-08-06 12:05 GMT

"శ్రీ" లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. "శ్రీ" కారమున "శవర్ణ", "రేఫ", "ఈ" కారములు చేరి, "శ్రీ" అయినది. అందు "శవర్ణ" , "ఈ" కారములకు, "లక్ష్మీ దేవి" ఆధిదేవత, "రేపము" నకు, అగ్ని దేవుడు దేవత. "శ్రియ మిచ్దేద్దు తాశనాత్!" అను పురాణ వచనానుసారముగా "అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా "శ్రీ" లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు. "శ" వర్ణమునకు గ్రహము "గురుడు", "రేఫ "ఈ" కరములకు గ్రహములు "గురుడు", "శుక్రుడు" గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున "శ్రీ" శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది. నిఘంటువులో, "కమలా శ్రీర్హరి ప్రియా" అని ఉండటంతో, లక్ష్మీ నామలలో "శ్రీ" ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.ఇన్ని విధాలుగా "శ్రీ" సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, "శ్రీ" కారం తలమానికమై వెలుగొందుచున్నది. "శ్రీ" శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ మతమందైననూ, ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, "శ్రీ" అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

ఓం" తో అన్నిమంత్రాలు, వైదిక ప్రార్ధనలు ఆరంభమవుతాయి. ఓం అభినందనలలో కూడా అది వాడబడుతుంది. దాని ఆకారము పూజింపబడుతుంది. దానిపై భావన చేయబడుతుంది. శుభసూచకంగా వాడబడుతుంది. ఇది మంత్రము మాదిరి గానే పదే పదే జపించ బడుతుంది. ఓంకారనాదము చేసినప్పుడు వచ్చే శబ్దము గంట యొక్క ప్రతిధ్వనిని పోలి ఉండాలి అది మనసుని శాంతింపచేసి పరిపూర్ణమైన సూక్ష్మమైన శబ్దంతో సంధింప జేస్తుంది. మానవులు దాని అర్ధంపైన ధ్యానం చేసి ఆత్మానుభవాన్ని పొందుతారు. అసలు శబ్దానికీ, జీవ సృష్టికీ సంబధం ఏమిటి అని సూక్ష్మంగా పరిశీలిస్తే శబ్దం వాయు ప్రకంపనలద్వారా తెలుస్తుంటుంది. శరీరంలో అనేకరకాల శబ్దాలు కలుగుతున్నప్పటికీ, అవి పైకి వినపడవు. ఇవన్నీ సూక్ష్మ శబ్దానికి చెందినవే; ఇవన్నీ వాయువువలనే కలుగుతుంటాయి. "ఓం" అనేది ఒక అక్షరం, ఒక పదం, ఒక వాక్యం. ఓం కారము నుండి సకల వర్ణములు ఉత్పన్నము లైనవని వేదములు చెప్పుచున్నవి. ఓంకారము జీవనగమ్యం, సాధన, ప్రపంచము దాని వెనుక ఉన్న సత్యము భౌతికము అభౌతికము సాకార-నిర్వికారములు అన్నింటిని తెలియబరుస్తుంది.

మనం దేనిని చూస్తున్నామో, దేనిని స్పృశిస్తున్నామో, దేనిని వింటున్నామో, దేనిని అనుభూతి చెందుతున్నామో అదంతా ఓంకారమే. మన పరిధిలో ఉండేది మాత్రమే కాక, మన పరిధిని దాటి ఉన్నది కూడా ఓంకారమే. మనం ఓంకారాన్ని శబ్ద మాత్రంగా పరిగణించినా, భగవంతునికి ప్రతీకగా భావించినా అన్నిటినీ కోల్పోయినట్టే.

 

Tags:    

Similar News