లక్ష్మీ దేవత విష్ణువు పాదాలను ఎందుకు నొక్కుతూ ఉంటుంది? అసలు రహస్యం ఇదేనంట..!

Lord Vishnu, Lakshmi: వీరిద్దరి ఆశీర్వాదాలు పొందితే అలాంటి వ్యక్తుల జీవితం ధన్యమవుతుంది. విష్ణువును విశ్వానికి రక్షకుడిగా పిలుస్తుంటారు. అయితే తల్లి లక్ష్మి సంపదకు దేవతగా నిలుస్తుంది. కానీ, వైకుంఠంలో, లక్ష్మి ఎల్లప్పుడూ శ్రీ హరి విష్ణువు పాదాల వైపు కూర్చుని, విష్ణువు పాదాలను నొక్కుతూ ఉంటుంది.

Update: 2023-05-06 05:31 GMT

లక్ష్మీ దేవత విష్ణువు పాదాలను ఎందుకు నొక్కుతూ ఉంటుంది? అసలు రహస్యం ఇదేనంట..!

Lord Vishnu, Lakshmi: హిందూ దేవుళ్లలో లక్ష్మీదేవి, విష్ణువు అంటే ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి ఆశీర్వాదాలు పొందితే అలాంటి వ్యక్తుల జీవితం ధన్యమవుతుంది. విష్ణువును విశ్వానికి రక్షకుడిగా పిలుస్తుంటారు. అయితే తల్లి లక్ష్మి సంపదకు దేవతగా నిలుస్తుంది. కానీ, వైకుంఠంలో, లక్ష్మి ఎల్లప్పుడూ శ్రీ హరి విష్ణువు పాదాల వైపు కూర్చుని, విష్ణువు పాదాలను నొక్కుతూ ఉంటుంది. ఇది అనేక మత గ్రంథాలలో కూడా ప్రస్తావించారు. అయితే లక్ష్మీ దేవత ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా? దీనికి సంబంధించి అనేక పౌరాణిక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నారదుడికి అసలు విషయం చెప్పిన దేవత..

దీని గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న పురాణాల ప్రకారం.. ఒకసారి నారదుడు స్వయంగా ఈ ప్రశ్న లక్ష్మీదేవిని అడిగాడు. ఆమె ఎల్లప్పుడూ విష్ణువు పాదాలను ఎందుకు నొక్కుతుందో ఆమె నుంచే తెలుసుకోవాలనుకున్నాడు.

లక్ష్మీదేవి విష్ణువు పాదాలను ఎందుకు నొక్కుతుంది?

లక్షీ దేవత మాట్లాడుతూ.. గ్రహాల ప్రభావం అందరిపైనా ఉంటుంది. దేవుడే అయినా దాని నుంచి ఎవరూ తప్పించుకోలేదరని లక్ష్మీదేవత నారదుడికి చెప్పిందంట. దేవగురువు స్త్రీల చేతులలో నివసిస్తే, రాక్షస గురువు శుక్రాచార్య పురుషుల పాదాలలో నివసిస్తాడు అని ఆ దేవత పేర్కొందంట. ఒక స్త్రీ పురుషుడి పాదాలను నొక్కడం వల్ల.. అప్పుడు దేవుడికి, రాక్షసుడికి మధ్య కలయిక ఉంటుందని చెప్పిందంట.

ధనం వృద్ధి చెంది శుభం కలుగుతుంది..

మహావిష్ణువు పాదాలను నొక్కితే దేవతలు, రాక్షసుల కలయిక వల్ల ఐశ్వర్యం కలుగుతుందని లక్ష్మీ దేవత చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనితో పాటు, శుభం కూడా కలుగుతుందని అంటుంటారు. అందువల్ల మనం ఇప్పటి వరకు చూసిన ఫొటోలలో విష్ణువు పాదాలను లక్ష్మీ దేవత నొక్కడం కనిపిస్తుంది.

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.)

Tags:    

Similar News