Sri Ramanavami 2024: శ్రీరామనవమి రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..!

Sri Ramanavami 2024: హిందువుల ముఖ్య పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీ రాముడు జన్మించాడు.

Update: 2024-04-16 12:30 GMT

Sri Ramanavami 2024: శ్రీరామనవమి రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..!

Sri Ramanavami 2024: హిందువుల ముఖ్య పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీ రాముడు జన్మించాడు. అరణ్యవాసం తర్వాత ఆయప పట్టాభిషేకం, సీతారాముల కల్యాణం కూడా ఇదే రోజు జరిగింది. అందుకే ఈ రోజును అత్యంత పవిత్రదినంగా చెబుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 17, బుధవారం శ్రీరామనవమి వస్తోంది. ఈ రోజున దేశంలోని రామాలయాల్లో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి ఈరోజు తెలుసుకుందాం.

శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు

శ్రీరాముడిని కొలిచే ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా మాంసం తినవద్దు మద్యం తాగవద్దు. అలాగే వంటలలో అల్లం వెల్లుల్లి ఉపయోగించవద్దు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆహారంలో కలిపి తీసుకోకూడదు. శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదు. శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించకూడదు, అబద్ధాలు ఆడకూడదు.

చేయవలసిన పనులు

శ్రీ రామ జయ రామ జయ జయ రామ.. అంటూ శ్రీరామ జపం చేయాలి. శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల సుఖం, శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి. శ్రీ రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ సమయంలో రామ నవమి పూజ చేయడం మంచిది. అలాగే ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేయవచ్చు. స్వామివారికి తలంబ్రాలు పడిన తరువాతనే మధ్యాహ్న భోజనం చేయాలి. ఆలయానికి వెళ్లి శ్రీరామ కల్యాణం చూడాలి.

Tags:    

Similar News