Vinayaka Navaratri 2023: గణేశుడికి ఈ నైవేద్యాలంటే చాలా ఇష్టం.. ఎందుకంటే..?
Vinayaka Navaratri 2023: హిందువుల ముఖ్య పండుగలలో వినాయక చవితి ఒకటి. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ ఉత్సవాలలో చిన్నా పెద్దా తేడాలేకుండా అందరు పాల్గొంటారు.
Vinayaka Navaratri 2023: హిందువుల ముఖ్య పండుగలలో వినాయక చవితి ఒకటి. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ ఉత్సవాలలో చిన్నా పెద్దా తేడాలేకుండా అందరు పాల్గొంటారు. నవరాత్రులు పూజలు చేసి గణపతిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. అయితే తొమ్మిది రోజులు గణపతికి చేసే పూజా విధానలు, నైవేద్యాలు ప్రత్యేకంగా ఉంటాయి. వినాయకుడు మంచి ఆహార ప్రియుడు కాబట్టి ఆయనకి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
మొదటి రోజు వరసిద్ది వినాయకుడి ఆవాహన చేసి పూజించి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంటింటా వినాయక పూజ చేసుకోవాలి. రెండో రోజు వికట వినాయకుడిని పూజించాలి. అటుకులను నైవూద్యంగా సమర్పించాలి. మూడో రోజు లంబోదర వినాయకుడిని పూజించి పేలాలను నైవేద్యంగా సమర్పించాలి. నాలుగో రోజు గజానన రూపంలో పూజించాలి.
ఐదో రోజు మహోదర వినాయకుడిగా పూజించాలి. కొబ్బరి కురిడిని నైవేద్యంగా సమర్పించాలి.
ఆరో రోజు ఏకదంత వినాయకుడిని పూజించి నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఏడో రోజు వక్రతుండ వినాయకుడిని పూజించి అరటి పండ్లతో పాటు ఇతర రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఎనిమిదో రోజు విఘ్నరాజ వినాయకుడిగా పూజించి సత్తుపిండిని నైవేద్యంగా పెట్టాలి. తొమ్మిదో రోజు ధూమ్రవర్ణ వినాయకుడిగా పూజించి నేతి అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి.