తిరుమల సమాచారం: భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారికి పెరిగిన హుండీ ఆదాయం!
♦ శుక్రవారం హుండీ ఆదాయం భారీగా వచ్చింది ♦ తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ
(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)
పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ శనివారం కావడంతో, స్వామివారికి నిత్యసేవలు మినహా ప్రత్యేకసేవలుండవు.
ఇక సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 6 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతొంది.
నిన్నటి రోజు శుక్రవారం 71,085 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 4.22 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 29,126 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.