ఏడుకొండలవాడి సన్నిధిలో సాధారణంగా భక్తుల రద్దీ

Update: 2019-10-25 04:44 GMT


*స్వామివారి దర్శనానికి సామన్యభక్తులకు 8 గంటల సమయం

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)


పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.... ఇవాళ శుక్రవారం కావడంతో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి పురాభిషేకం (శుక్రవారాభిషేకం) నిర్వహించి...నూతన పట్టువస్త్రాన్ని, ఉత్తరీయాన్ని.....వజ్రవైడుర్యాలు, మరకత-మాణిక్యాలు పొదిగిన సువర్ణాభరణాలతో స్వామివారిని అర్చకులు అలంకరించారు.... ఇక సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 8 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనం ద్వారా దర్శించుకునే భక్తులకు 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆధార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతొంది... నిన్నటి రోజు గురువారం 60,698 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, వీరు సమర్పించిన కానుకలతో రూ 3.84 కోట్లు హుండీ ఆదాయం శ్రీవారికి వచ్చింది, 23,503 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

Tags:    

Similar News