తిరుమల సమాచారం: బ్రహ్మోత్సవాల సందర్భంగా వీఐపీ దర్శనాల రద్దు
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగానే ఉంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడం, వారంతం కావడంతో భక్తులు తిరుమల బాట పట్టారు.
(తిరుమల నుంచి హెచ్ ఎం టీవీ ప్రతినిధి)
ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేకప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మరోవైపు బ్రహ్మోత్సవాలు దృష్ట్యా సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ప్రోటోకాల్ విఐపీ స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనం కేటాయించ నున్నారు. అదేవిధంగా దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును అక్టోబర్ 10వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. అంతే కాకుండా అక్టోబరు 8వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒక సం||లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేశారు.
ఇక నిన్న(శనివారం) 88,320 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి శనివారం హుండీ ఆదాయం రూ 2.49 కోట్లు. మొత్తం 32,703 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు