గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?

Update: 2019-09-07 12:12 GMT

ప్రదక్షిణంలో ' ప్ర ' అనే అక్షరము పాపాలకి నాశనము… ' ద ' అనగా కోరికలు తీర్చమని , ' క్షి ' అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ' ణ ' అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్నీ వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. 

Tags:    

Similar News