అరసవెల్లిలో భక్తులకు నిరాశ
-అరసవెల్లిలో భక్తులకు నిరాశ -ఉపరితల ఆవర్తనం కారణంగా ఆకాశం మేఘావృతం -స్వామివారికి జరగని కిరణ స్పర్శ -తీవ్ర నిరాశతో వెనుతిరిగిన భక్తులు
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ద అరసవెల్లి సూర్యనారాయణస్వామి భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో స్వామి వారికి కిరణ స్పర్శ జరగలేదు. ఉత్తర, దక్షిణాయన మార్పుల్లో భాగంగా యేడాదికి రెండుసార్లు సూర్య కిరణాలు మూల విరాట్ ను తాకుతాయి. అయితే దక్షిణాయణంలో భాగంగా అక్టోబరు నెల ఒకటి ,రెండు తేదీల్లోఈ అద్బుత ఆవిష్కరణ జరుగుతుంది. కిరణాల స్పర్శ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అయితే ఈ యేడాది కిరణ స్పర్శ జరగలేదు. కిరణ స్పర్శను వీక్షించటానికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. రేపు కూడా లేలేత కిరణాలు మూల విరాట్ ను తాకే అవకాశం ఉందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.