Bad Luck Dreams: ఇలాంటి కలలు ఆర్థిక నష్టాలకు కారణాలు.. నివారించాలంటే ఈ పని చేయండి..!

Bad Luck Dreams: మనం ప్రతిరోజు రాత్రి నిద్రలోకి జారుకోగానే కలలు రావడం మొదలవుతాయి. ఇది ప్రతి ఒక్కరికీ జరుగుతుంది.

Update: 2023-12-16 15:30 GMT

Bad Luck Dreams: ఇలాంటి కలలు ఆర్థిక నష్టాలకు కారణాలు.. నివారించాలంటే ఈ పని చేయండి..!

Bad Luck Dreams: మనం ప్రతిరోజు రాత్రి నిద్రలోకి జారుకోగానే కలలు రావడం మొదలవుతాయి. ఇది ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. అయితే కొన్ని కలల మనకు నిజజీవితంలో ప్రతిబింబిస్తాయి. మనకు మంచి లేదా చెడు జరుగుతుందనే సంకేతాలను అందిస్తాయి. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. అది నిజజీవితంలో ప్రతిబింబిస్తుంది. వేర్వేరు సమయాల్లో కనిపించే కలలు వేర్వేరు ఫలితాలను ఇస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం అశుభాన్ని సూచించే కలల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఈ కలలు ఆర్థిక నష్టానికి సంకేతాలు

మూసి ఉన్న తలుపు: కలలో మూసిన తలుపును చూడటం అశుభం. జీవితంలో డబ్బు రాక ఆగిపోతుందని అర్థం. మీకు ఇలాంటి కల వస్తే జాగ్రత్తగా ఉండాలి.

ఎత్తు నుంచి పడిపోతున్నట్లు రావడం: మీరు కలలో పదే పదే ఎత్తు నుంచి పడిపోతున్నట్లు కలవస్తే ఆర్థిక నష్టానికి సంకేతం. ఇది కాకుండా మీ మనస్సులో దాగి ఉన్న భయానికి సంకేతం అవుతుంది. ఈ భయాన్ని తెలుసుకుని దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

కళ్లపై కాటుక పూయడం: మీరు కలలో కళ్లపై కాటుక అప్లై చేస్తున్నట్లు కలవస్తే అనారోగ్యం లేదా శారీరక నొప్పులు ఎదురవుతాయని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

కట్‌ అయిన చేతులను చూడటం: ఒక వ్యక్తి చేతులు కట్‌ అయినట్లు కలలో చూస్తే మీ ప్రియమైన వ్యక్తి మరణం లాంటి బాధకు సంకేతం. ఎండిన పువ్వు లేదా తోటను కలలో చూస్తే జీవితంలో కష్టాలు ఎదురవుతాయని సంకేతం.

కలలో భూకంపం: మీరు కలలో భూకంపాన్ని, కదులుతున్న పర్వతాన్ని చూసినట్లయితే ఏదైనా వ్యాధి లేదా అనారోగ్యానికి సంకేతం.

చెడు కలలకు నివారణలు

మీకు ఇలాంటి కలలు వస్తే ఉదయం నిద్రలేచిన వెంటనే భగవంతుని స్మరించుకోండి. అలాగే గుడికి వెళ్లి కష్టాల నుంచి రక్షణ కల్పించమని దేవుడిని ప్రార్థించండి.

Tags:    

Similar News