యోగ నరసింహుడి అవతారంలో సింహవాహనంపై శ్రీవారు

Update: 2019-10-02 15:17 GMT

తిరుమల, హెచ్ ఎం టీవీ ప్రతినిధి 

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కన్నులపండువగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా  బుధవారం ఉదయం స్వామివారి యోగ నరసింహావతారంలో సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు...సర్వాలంకార భూషితుడై యోగముద్రలో బంగారు సింహాన్ని అధిరోహించి మాడా వీధుల్లో ఊరేగుతున్న స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు...శ్రీమహావిష్ణువు దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కాబట్టి సింహం గొప్పతనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని శ్రీవారి సింహా వాహనసేవలో అంతరార్థం....బ్రహ్మారథం ముందు కదలగా, వృషభాలు, ఆశ్వాలు, గజరాజుకు ఠీవిగా మెల్లగా నడుస్తుండగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వారి ప్రదర్శనతో భక్తులకు ఆహ్లాదాన్ని అందించారు.. ఇక  రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

Tags:    

Similar News