ఆధ్యాత్మికతకు అసలు అర్థం ఏంటి?

Update: 2019-08-08 07:49 GMT

కొన్నేళ్ల నుంచి ఇంతకూ ముందెన్నడూ లేని విధంగా మరి౦త ఎక్కువమంది ప్రజలు తమను తాము ఆధ్యాత్మికవాదులుగా పిలుచుకుంటూ ఉన్నారు. వాస్తవంగా, మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఆధ్యాత్మిక ధోరణుల వేగం పుంజుకుంది. ఇది అత్యంత సహజసిద్దమైన సుగుణంగా, లేదా ఆత్మకి అనుసంధానంగా ఉండే స్థితి. ఈ కాలంలో కొందరు ఆద్యాత్మికత పేరున ధనాకాంక్షను కూడా కలిగి ఉండడం, ఆద్యాత్మిక చింతనను పక్కదోవ పట్టించేలా తయారైందన్నది జగమెరిగిన వాస్తవం. ఆధ్యాత్మికతలో కూడా భౌతికమైన లోకాన్ని చూసి ఆనందించవచ్చు. స్వీయ విచారణ మరియు స్వీయ నిర్ణయం మరియు జీవితానికి గల నిఘూడ అర్ధాన్ని కనుగొనగలిగే అద్భుతమైన మార్గంగా ఆత్యాత్మికత ఉంటుంది.

బయటి ప్రపంచంలోని అందమైన, ఖరీదైన వస్తువుల గురించిన ఆలోచన చేయక, తమ అవసరాన్ని పరిధులను మించకుండా ఆలోచన చేయగలిగిన వారిగా ఈ ఆధ్యాత్మిక ధోరణి కలిగిన వ్యక్తులు ఉంటారు. బదులుగా, వారు తమలో తామే ఒక అందమైన ప్రపంచాన్ని, ప్రయాణాన్ని కలిగి ఉంటారు. తమలో తామే దృష్టి కేంద్రీకరించగలిగి, బయటి నుంచి గడపటానికి ఈ ప్రయాణం ఆధ్యాత్మిక వ్యక్తుల జీవితాల్లో అత్యంత మౌలికమైనదిగా చెబుతారు. ఈ ప్రపంచంలో ప్రతి విషయములోనూ, ఒకదానితో మరొకటి అనుసంధానమయ్యే అమూల్యమైన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక వ్యక్తులు పొందుతారు. ఆధ్యాత్మిక ప్రజలు ప్రతి విషయంలోనూ దయాహృదయాన్ని కలిగి ఉంటారని, జ్ఞానంతో వ్యవహరిస్తారు.

ఇక- కృతజ్ఞతా దృక్పధాన్ని సాధన చేయడం ఆధ్యాత్మిక వ్యక్తులకు ఉండాల్సిన ప్రాథమిక స్వభావం. జీవితం తమకు అత్యుత్తమమైనదిగా భావిస్తూ, విశ్వం తమకు అధిక శక్తిని చేకూరుస్తుందని తెలుసుకోవడం ద్వారా, వారు కృతజ్ఞతా భావాన్ని పొందగలుగుతారు. ఆధ్యాత్మిక వ్యక్తులు నిరంతరం ఒక ఉన్నతమైన శక్తితో అనుసంధానమై ఉంటారు. ఈ శక్తి వారిని తమ ఆధీనంలో ఉంచుకుంటుంది. ఆత్మ ఉన్నతమైన కొలమానం, ఆధ్యాత్మికత పరాకాష్టకు మార్గదర్శి. అందరిలో సమానత్వాన్ని చూడడం ఆధ్యాత్మిక ధోరణి కలిగిన వ్యక్తుల ప్రధాన లక్షణం.

ప్రతి మనిషికి తనకంటూ, ప్రత్యేకమైన భావాలు, అభిప్రాయాలు, అలవాట్లు ఉంటాయి. ఏరోజైతే, వాటన్నిటినీ కూడా ఆహ్వానించి సాధ్యాసాద్యాల పరిణితి సాధించగలిగి, వాస్తవిక ధోరణిని అవలంభించుకుంటారో, అప్పుడే ఆద్యాత్మిక ధోరణికి పరిపూర్ణ అర్ధం. 

Tags:    

Similar News