స్నానమంటే హడావుడిగా నాలుగు చెంబుల నీళ్లు వంటిపై పోసుకొని వచ్చేయడం కాదు. ఇక మరి కొందరు శరీరం కూడా పూర్తిగా తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు. కానీ స్నానవిధి అలా చేయకూడదు. స్నానం ముందుగా తలపై నీళ్లు పోసుకుని ఆ తరువాత వీపు, శరీరభాగం, కాళ్లు, చేతులు, ముఖం ఇలా అన్ని శరీర అంగాలు తడిసిన తరువాత.. శరీరాన్ని అదే క్రమపద్దతిలో సబ్బుతో రుద్దుకుని.. శరీరాన్ని బాగా చేతులతో రాసుకున్న తరువాత మళ్లీ నీళ్లను పోసుకుని సబ్బును కడిగేసుకోవాలి. ఇలా పూర్తిగా సబ్బు వదిలిన తరువాత కూడా మరో రెండు చెంబులు పోసుకుని మరీ రావాలి. ఇక స్నానాలన్నింటిలోకెళ్లా సముద్రస్నానం ఆచరించడం శరీరానికి చాలా మంచిది. సముద్రనీళ్లలో వున్న లవణం.. స్నానం ద్వారా శరీరంపైనుండే మలినాలు పోగొడతాయి. అంతేకాదు నీళ్లు స్నానం సమయంలో ఒంట్లోకి వెళ్లినా మంచిదేనంటారు. శరీరంలోని రుగ్మతలను కూడా ఈ స్నానం దూరం చేస్తుందని పెద్దలు అంటారు.
స్నానం ఒక పని కాదు. ఓ భోగం. సంతృప్తిగా అనుభవించాలి. కనీసం అరగంటైనా స్నానం చేస్తే మంచిది. 4 చెంబులతో శరీరాన్ని బాగా తడిపి, సున్ని పిండి లేదా సబ్బు తో శుభ్రంగా రుద్దుకొని, ఆపై 7-8 చెంబులతో శుభ్రపరచుకోవాలి. చక్కటి మెత్తటి టవల్ తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి. స్నానం తరువాత శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. శుభ్రంగా స్నానం చేసి ఫ్యాన్ కింద ఓ నిమిషం నిల్చొని ఆపై దుస్తులు ధరించండి.