పురాణాలు.. మన ఆధ్యాత్మిక భాండాగారాలు

Update: 2019-08-28 04:27 GMT

పురాణాలు అనేకం ఉన్నప్పటికీ పద్దెనిమిది మహాపురాణాలు మాత్రం అత్యంత ముఖ్యం. మహాపురాణాలే కాక ఉప పురాణాలు, స్థల పురాణాలు, కుల పురాణాలు అంటూ భరత ఖండంలో ఇంకా అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. దేనికవే సాటి. దేనికవే ప్రత్యేకం. కాకపోతే, అష్టాదశ మహాపురాణాలు మాత్రం సంప్రదాయ వాద పండితులు ... వేద వ్యాస కృతం అంటారు. అంటే, వ్యాసుడు సకల పురాణాలు కూడా తానే రచించాడని అర్థం. అటువంటి వ్యాసుడే అన్ని పురాణాలను, భారత ఇతిహాసాన్ని లోకానికి అందించిన తరువాత... ఇంకా అసంతృప్తి, మనోవ్యధ ఉండటంతో... భాగవత పురాణం సృజించాడు. అది కూడా మహాపురాణాల్లో ఒకటి. అత్యంత ప్రచారం పొందినది.

పద్దెనిమిది మహాపురాణాలు.... బ్రహ్మ పురాణం, పద్మ పురాణము, విష్ణు పురాణం, శివ పురాణం, లింగ పురాణము, గరుడ పురాణం, నారద పురాణము, భాగవత పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణం , భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం , బ్రహ్మవైవర్త పురాణం, మార్కండేయ పురాణం, వామన పురాణము , వరాహ పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఇవన్నీ కూడా వ్యాసకృతములే. అయినప్పటికీ... ఒకనొక సమయమున నైమిశార్యమున దీర్ఘ సత్రయాగం చేసిన శౌనకాది మునులు సూతుని అడిగినట్టుగా చెప్పబడుతూ ఉంటుంది. మన పురాణాల వంటి వాంగ్మయం, సాహిత్యం ప్రపంచంలోని మరే దేశానికి లేదు. అందుకే, సకల పురాణాల్ని మనం సర్వధా కాపాడుకోవాలి. పురాణాలు రక్షించుకోవటం అంటే... వాటిని శ్రవణం, మననం, జీర్ణం చేసుకోవటమే! 

Tags:    

Similar News