నవ వధువు కుడి కాలితో ఇంట్లోకి ఎందుకు అడుగుపెడుతుంది?

Update: 2019-08-07 11:58 GMT

 కొత్తగా వివాహమైన వధువు.. అత్తింటికి వచ్చేటపుడు.. ఇంట్లోకి ముందుగా కుడికాలే పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇదొక్క కొత్త కోడలికే వర్తించదు... ఏ శుభకార్యమైనా అంతే. రాజకీయాల్లో కూడా ఈ సంప్రదాయం కొత్తగా కనిపించింది. రాజకీయాల్లోనూ కనిపిస్తుంది. దైవభక్తి... జ్యోతిష, వాస్తు మీద నమ్మకం ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌లాంటి నాయకుడికే కాదు... ఏపీ సీఎం జగన్‌ కూడా దాన్నే పాలో అవుతున్నారు. జల వివాదాల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఏపీ నుంచి వచ్చిన సీఎం జగన్‌ను సాదరంగా ఆహ్వానించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌... జగన్‌ను ప్రగతి భవన్‌లోకి తీసుకెళ్లారు.

ఇక అసలు విషయానికొస్తే...

దేవుడు సృష్టించిన మనిషికి ప్రతీ అంగమూ ప్రత్యేకమే. అవి కాళ్లయినా, చేతులైనా. మరి రెండు కాళ్లు ఈక్వల్‌ అనుకున్నప్పుడు... కుడికాలుకే ఎందుకు విశిష్టత. ఇక్కడ చిన్న లాజిక్‌గా థింక్‌ చేద్దాం. విశ్వంలోని గ్రహాలకు మనిషి శరీరంలోని భాగాలకు ఏదో సంబంధం ఉందని శాస్త్రం చెబుతోంది. శిరస్సుకు సూర్యుడు, ముఖానికి చంద్రుడు, కంఠానికి కుజుడు, శరీరంలోని ఎడమ భాగానికి బుధుడు, కుడి భాగానికి బృహస్పతి, హృదయానికి శుక్రుడు, మోకాళ్లకు శని, పాదాలకు రాహుకేతువులు ప్రాధాన్యం వహిస్తారన్నది జ్యోతిషశాస్త్రంలో చెప్పుకునే ఒక ఉదాహరణ. శరీరంలో కుడి భాగానికి ప్రాధాన్యత వహించే బృహస్పతి సర్వ శుభకారకుడు కావడం వల్ల ఏ శుభకార్యం కోసమైనా వెళ్లినప్పుడు తొలిసారి కుడికాలు గుమ్మంలో పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టడం మంచిదన్నది శాస్త్రవచనం. వివాహం, దాంపత్యం, సంతానం వంటివాటికి బృహస్పతే కారకుడు. ఏ శుభకార్యంలోనైనా కుడి కాలు ముందు మోపడం, కుడి చేత్తోనే పనులు ప్రారంభించడం అనాదిగా వస్తున్న సత్సంప్రదాయం, సర్వామోదం కూడా. తెలిసింది కదా... కుడికాలే ఎందుకు ముందు పెడతారో!! అదీ సంగతన్నమాట. 

Tags:    

Similar News