దేవుని ముందు పెట్టిన ప్రసాదాన్ని దేవుడు తింటే అది చూసి పులకించని భక్తులు ఉండరు.కానీ అల ఎక్కడైనా జరుగుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానము మంగళగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి. ఈ విషయాన్ని వివరంగ తెలుసుకునే ముందు ఇక్కడి స్థల పురాణాన్ని కాస్త తెలుసుకుందాము. ఈ క్షేత్రం విజయవాడ మరియు గుంటూరు కు అతి చేరువలో ఉంది.విజయవాడ నుంచి ప్రతి 10 నిమిషాలకు గుంటూరు కు బస్సు సౌకర్యం కలదు. ఆ మార్గ మధ్యలోనే ఈ ఆలయం కలదు.
పూర్వం ఈ ప్రాంతాన్ని పారియాత్ర అను రాజు పాలించేవాడు.అతనికి సంతానము లేకపోవుటచే, సంతానం కొరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగగా అతనికి ఒక శిశువు జన్మించాడు.అతనికి హస్తసృంగి అని పేరు పెట్టాడు. కానీ దురదృష్టవసాత్తు అ పిల్లవాడు అoగవికలాంగుడిగా జన్మించాడు.ఆ రాజు తన పుత్రుని చూసి చాల విచారపడ్డాడు.తండ్రి బాధ చూసి హస్తసృంగి బాధాతప్త హృదయంతో అడవులకు వెళ్లి భగవంతుని సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేసాడు.అంతట శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగా హస్తసృంగి తనకు తన జీవితాంతం భగవంతుని పాదాల చెంత ఉండాలని ఉండాలని చెప్పగా, శ్రీమహావిష్ణువు హస్తసృంగిని ఒక కొండగా మార్చివేసి దానిపై శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం లో కొలువయ్యాడు.అదియే ఇప్పటి పానకాల నరసింహస్వామి ఆలయం.
బ్రహ్మదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామిని పానకంతో అభిషేకించగా అగ్నిజ్వాలలు పూర్తిగా ఆరిపోయాయి. అప్పటినుంచి ఇక్కడ పానకంతో అభిషేకించడం ఆనవాయితీగా మారింది. ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే స్వామి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి నోటిలో పోస్తే నరసింహుడు ఆ పానకాన్ని గుటకలు వేస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు.గుటకలు వేసిన శబ్దం కూడా స్ఫష్టంగా వినిపిస్తుంది.స్వామికి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి కి అందివ్వగా స్వామి దానిని త్రాగి మరల కొంత పానకాన్ని బయటకు వదులుతాడు.దానినే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతరం పానకం నైవేద్యం వల్ల అక్కడ పానకం నేలపై పడినా అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు మరియు ఒక ఈగ కూడా వాలదు.
భగవంతుడుకి ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడే తింటే వచ్చే అలౌకిక ఆనందాన్ని భక్తులు సొంతం చేసుకుంటారు.