Chandra Grahan Bad Effects 2023: చంద్రగ్రహణం ముగిసింది.. దుష్ప్రభావాలు తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి..!

Chandra Grahan Bad Effects 2023: చంద్రగ్రహణం ముగిసింది.. దుష్ప్రభావాలు తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి..!

Update: 2023-10-29 10:25 GMT

Chandra Grahan Bad Effects 2023: చంద్రగ్రహణం ముగిసింది.. దుష్ప్రభావాలు తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి..!

Chandra Grahan Bad Effects 2023: ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం అక్టోబర్ 28 తెల్లవారు జామున 1:05 గంటలకు ప్రారంభమై 2:25 గంటలకు ముగిసింది. ఈ గ్రహణం వల్ల కలిగే దుష్ఫలితాలు కొన్ని రోజుల పాటు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 15 రోజుల పాటు ప్రజలపై శుభ, అశుభ ప్రభావాలను చూపుతాయి. ఈ పరిస్థితిలో గ్రహణం దుష్ప్రభావాలు తొలగిపోవాలంటే గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పనులు చేయాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ముందుగా స్నానం చేయాలి. పవిత్ర నదిలో స్నానం చేయడం లేదా ఇంట్లో ఉన్న నీటిలో గంగాజలం కలుపుకొని చేస్తే మంచిది. తర్వాత ఇల్లు మొత్తం గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం వల్ల ఏర్పడే నెగిటివ్‌ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.

గ్రహణం సమయంలో ఆలయ తలుపులు మూసివేస్తారు. అలాగే ఇంట్లో ఉండే పూజగది తలుపులు కూడా మూయాలి. గ్రహణం తర్వాత ఆలయ తలుపులు తెరిచి స్వామికి స్నానమాచరించి, కొత్త వస్త్రాలు ధరించి, అగరబత్తులు, నెయ్యి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేయాలి. తర్వాత నైవేద్యం సమర్పించాలి.

చంద్రగ్రహణం ముగిసిన తర్వాత దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహణం తర్వాత చేసే దానానికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. దీనివల్ల గ్రహణం వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగిపోతాయి. చంద్రగ్రహణం తరువాత మీరు ధాన్యాలు, కూరగాయలు, నూనె మొదలైన వస్తువులను దానం చేయవచ్చు. వీటిని బ్రాహ్మణుడికి లేదా పేదవారికి మాత్రమే అందించాలి.

Tags:    

Similar News