జీవితాన్ని ఆడుకునే హక్కు కాలానికే ఉంటుంది? కాదంటారా?

Update: 2019-09-03 09:25 GMT

కాలమే లేకపోతే ప్రారంభమూ ఉండదు, అంతమూ ఉండదు. ఆద్యంతాలు లేకపోతే సృష్టే ఉండదు. కాలంలోనే మన ఆస్థిత్వం ఉన్నది. కాలంలోనే మనం జన్మిచాం. కాలంలోనే మనం మరణిస్తాం. ఏ వ్యక్తి ఐనా కాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే, కాలం ధర్మాన్ని అర్థం చేసుకున్నట్లయితే, కాల ధర్మానికి అనుగుణంగా నడుచుకున్నట్లయితే, ఆ వ్యక్తి జయుడే కాదు, విజయుడవుతాడు. ఒకరిక్కడ సాధించవచ్చు, మరొకరు మరొకచోట. కాలధర్మానికి అనుగుణంగా లేని వ్యక్తి జీవిత ప్రక్రియలో నలిగి నశించిపోతాడు. జీవితం అన్నది కాలం ఆడే ఒక ఆట. దీన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ దేశంలోని ప్రాచీన ఋషులు, మునులు, యోగులు కాలంపై అత్యంత శ్రద్ధ పెట్టారు. కాలం అంటే మన భావన ప్రస్తుతము, మన చుట్టూ వెనువెంటనే ఉన్న సృష్టికి – భూగోళానికీ, సౌరవ్యవస్థకూ – సంబంధించినది.

భూగోళం తన చుట్టూ తాను సమయం ప్రకారం పరిభ్రమిస్తూ ఉంటేనే మీరు బాగుంటారు. కాని భూపరిభ్రమణం సమయం తప్పితే మన పరిస్థితి అధోగతి. మీరు దానికి అనుగుణంగా లేకపోయినా అది మీకు మంచిదికాదు. మీరు కాలంపై స్వారీ చేయకపోతే మీ జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది – బహుశా కష్టాలమయంగా కూడా ఉండవచ్చు. కాలం అన్నది మనం కనుక్కున్న భావన కాదని చెప్పడానికే ఇదంతా – కాలం అన్నది వ్యవస్థలో గాఢంగా వేళ్లూనుకొని ఉంది, మన నిర్మాణమే దానికి అనుగుణంగా జరిగింది. మనం మహాభారతం చదివితే యుగాల గురించీ, అవి ఎలా నడుస్తాయన్న దాని గురించీ ఎన్నో విషయాలు చెప్పారు. మానవజీవితంపై కాలప్రభావాన్ని మీరు పరిశీలించాలని నా కోరిక. ఇదేదో ఎవరో ఊహించింది కాదు – ఇదొక అద్భుతమైన, గొప్ప విజ్ఞానం. యోగా ఎల్లప్పుడూ దీనితో గాఢంగా పెనవేసుకుని ఉంది. దాని గురించి సిద్ధాంతాలు చేయడంలో యోగా దృష్టి పెట్టదు. అభ్యాసంతో మనం మన శరీరాన్ని సృష్టికీ, కాలాలకీ, స్థలాలకీ అనుగుణంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే వాటికి అనుగుణంగా లేకుండా మనం ముందుకు సాగలేం. మీరు కాలంపై స్వారీ చేయకపోతే మీ జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది – బహుశా కష్టాలమయంగా కూడా ఉండవచ్చు. మీరు కాలంపై స్వారీ చేయగలిగితే మీ జీవితం అసాధారణంగా ఉంటుందన్న నిజాన్ని మరిచిపోవద్దు.

Tags:    

Similar News