కలిపురుషుడి ప్రభావం ఎక్కడ ఉంటుందో తెలుసా?

Update: 2019-09-18 11:36 GMT

ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్య కరమైన విషంయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచుని ఉంటే, దాని ముందు ఆవు ఒకటి నిలబడి పిల్లలగూర్చి జాడ తెలియక బాధపడుచున్న దానివలే ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు " ఎందుకు ఏడుస్తున్నావు మంగళ ప్రదురాలా? " అని ప్రశ్నిస్తుంది. అందుకా ఆవు "నేను ఏడుస్తున్నది నాగురించి కాదు, నేడు ఆశ్రీలలనేశుడి లేమి వలన కాలముచే నీకు ఒంటి కలయ్యెను కదా!? అని దుఃఖిస్తున్నాను. ఆ కలి ప్రభావముచే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమలకు బాధ కలుగుతుంది కదా అని బాధ పడుతున్నాను" అంటుంది.

అప్పుడు పరీక్షిత్తు చెప్పాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు.

1 : జూదశాల యందు నీవు ఉండ వచ్చు.

2 : పాన ( మద్య ) శాలయందు నీవు ఉండవచ్చు.

3 : ఆచార భ్రష్టులైన స్త్రీల యందు నీవు ఉండవచ్చు.

4 : జీవ హింస జరిగే ప్రదేశములయందు నీవు ఉండవచ్చు.

అది విని కలిపురుషుడు అయ్యా మీరు నాలుగుస్థానాలిచ్చారు. కానీ వాటయందు నేను నిలబడడానికి వీలుకలిగేటట్టు లేదు. నాకు ఇంకొక్క స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు.

అందుకు పరీక్షిత్తు

5 : బంగారం ఇచ్చాను అన్నాడు.

అది విని చాలు మహాప్రభో చాలు అని నమస్కరించి వెళ్లి పోయాడు కలిపురుషుడు.

ఈ పై 5 విషయములందును కలి పురుషుని ప్రభావం ఉండును. వీనిలో దేనికి లోనైననూ మనం నైతికంగా పతనమవుతాము. భగవంతునికి దూరమవుతాము. కలి ప్రభావమునుండి భగవన్నామము ఒక్కటే రక్షించగలదు.

Tags:    

Similar News