Kartika Purnami 2023: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి.. ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయి..!

Kartika Purnami 2023: హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు.

Update: 2023-11-27 00:30 GMT

Kartika Purnami 2023: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి.. ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయి..!

Kartika Purnami 2023: హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి ఆలయ పరిసరాల్లో, ఇళ్లలో దీపాలు వెలగిస్తారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాలయాల్లో దీపాలు వెలిగించి భక్తి, శ్రద్దలతో ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి రోజును కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో సిరి, సంపదలకు లోటు ఉండదు. అలాంటి కొన్నింటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కార్తీక పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల త్రిమూర్తులు, తల్లి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అలాగే పచ్చి పాలు కలిపిన నీటిని రావి చెట్టుకు సమర్పించాలి. తర్వాత పిండి, నెయ్యి దీపాలు వెలిగించాలి. తరువాత చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణ చేయాలి.

కార్తీక పౌర్ణమి రాత్రి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. పూజ సమయంలో లక్ష్మీదేవికి బెల్లన్నం, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల తల్లి లక్ష్మి సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.

కార్తీకమాసంలో లక్ష్మీ స్వరూపమైన తులసి ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున తులసిని పూజించి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటారు. తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దాని ముందు నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం.

కార్తీక పౌర్ణమి రాత్రి చంద్రుడు తన 16 దశలతో నిండి ఉంటాడు. చంద్రునికి పాలు, నీరు సమర్పించాలి. అందులో పంచదార, తెల్లటి పువ్వులు కలపాలి. ఇలా చేయడం వల్ల చంద్రదోషం తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యం కలుగుతాయి.

కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుడిని సంహరించాడు. కాబట్టి ఈ రోజున ఆచారాల ప్రకారం శివుడిని పూజించడం వల్ల చంద్ర దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో కష్టాలు దూరమవుతాయి.

Tags:    

Similar News