ఆషాఢ పౌర్ణిమ సందర్భంగా సింహాచలం వరహా లక్ష్మీ నరసింహాస్వామి గిరిప్రదక్షిణ ఈరోజు ప్రారంభం అయింది. ఈ ప్రదక్షిణలో పాల్గోవడానికి భారీగా భక్త జనం తరలి వస్తున్నారు. దాదాపు పదిలక్షల మంది వరకూ గిరిప్రదక్షణలో పాల్గోవచ్చని అంచనా వేస్తున్నారు. సింహాచలం తొలి తపంచా దగ్గర ప్రారంభమయ్యే గిరి ప్రదక్షణ కార్యక్రమం తిరిగి అక్కడికి రావడంతో పూర్తవుతుంది.
ఒక వైపు కొండలు, మరొక వైపు సముద్రాన్నిచూస్తూ 32 కిలోమీటర్ల మేర ఈ ప్రదక్షిణ సాగుతుంది. సింహాచలేసుని పూల రథం తొలి తపంచా వద్ద నుంచి అట్టహాసంగా గిరిప్రదక్షణకు బయలు దేరింది. దీనిని అనుసరిస్తూ లక్షలాది మంది భక్తులు నడుస్తున్నారు. భగవన్నామ స్మరణతో సింహాచల గిరులు ప్రతిధ్వనిస్తున్నాయి.