భగవంతుడు గొప్పా... భక్తి గొప్పదా!!

Update: 2019-08-12 05:20 GMT

భగవంతుడిదీ భక్తుడిదీ విడదీయలేని సంబంధం. విడదీయరాని అనుబంధం. ఒకరుంటేనే మరొకరు. ఓ తత్త్వముంటేనే రెండోది సత్యమయ్యేది. నిత్యమయ్యేది. సాఫల్యమయ్యేది. భగవంతుడు లేనిదే భక్తుడుండడు. భక్తి ఉండదు. భక్తుడికి అస్తిత్వం ఉండదు. భక్తుడు లేకపోతే భగవంతునికి ఓ సాకారం ఉండదు. ఆకారం ఉండదు. భక్తుడుంటేనే భగవంతుడికి అస్తిత్వం ఉండేది. భగవంతుడుంటేనే భక్తుడికి పూర్ణత వచ్చేది. పరిపూర్ణత లభించేది. భగవంతుడు భక్తుడు ఇద్దరూ- ఒకరికి మరొకరు తోడుగా, నీడగా, జోడుగా, జోడీగా ఉంటేనే భక్తి ఉండేది. భక్తికో రూపం ఉండేది. స్వరూపం ఉండేది. సారూప్యం ఉండేది. సాయుజ్యం ఉండేది. అయితే భగవంతుడు, భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? ఎవరి అధీనంలో ఎవడుంటారు? ఎవరి ఆధిపత్యంలో ఎవరుండేది? ఈ ప్రశ్నలు సహజంగా కలగకమానవు.

శక్తివంతమైన భక్తికోసం తపించాలి, తపనపడాలి. వేధించాలి. వేదనపడాలి. రోదించాలి. సాధన చేయాలి. శోధన చేయాలి. అలాంటి భక్తితత్త్వాన్ని సంపాదించాలి. స్వంతం చేసుకోవాలి. సాఫల్యం చేసుకోవాలి. అసలు సిసలైన భక్తితత్త్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. అనుభవించాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలి.

ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కావాలి. పునీతులం కావాలి. భక్తి అలవడితే హెచ్చుతగ్గులు, తారతమ్యాలు ఇవేవీ కనబడవు. అంతా పరమాత్మ స్వరూపంగా భాసిస్తుంది. ప్రతివారు భగవంతుని స్వరూపులుగా కనిపిస్తారు. అంతా భగవంతుడే కనిపిస్తే హెచ్చుతగ్గులేముంటాయ.

Tags:    

Similar News