భగవంతుడు ఉన్నాడా.. ఉంటే ఎక్కడున్నాడు?

Update: 2019-08-12 05:00 GMT

ఒక అధ్యాత్మిక పథంలో ఉన్నామంటే, మనం సత్యాన్వేషణ చేస్తున్నామని అర్థం. కానీ, మీరు ఎలాంటి సత్యం కోసం చూస్తున్నారు..? చాలా మంది వారు ఒక గుడికో, ఒక చర్చికో, ఒక మసీదుకో లేదా ఆశ్రమానికో వస్తే వారికి దీనివల్ల ఎటువంటి లాభం దొరుకుతుంది..? అని చూస్తున్నారు. కానీ, ఎవరైతే నిజంగా శోధిస్తున్నారో వారికి సత్యం అంటే అది ఏదో వారికి ఉపయోగపడే విషయం కాదు. ఇది అంతటినీ తనలో ఇముడ్చుకున్నది. ఇది - ప్రపంచంలో నేను ఫలానా, అని చెప్పుకోవాలని అనుకుంటున్న, తెలివైనవారి కోసం కాదు. అటువంటి వారు దేనినో ఒక దానిని జయించాలనుకుంటున్నారు.

కేవలం మూర్ఖులు మాత్రమే తాము ఫలానాగా గుర్తింపు లేకుండా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. కేవలం ఒక మూర్ఖుడు మాత్రమే తాను లొంగిపోయి, వేరే వారితో జయించబడాలని అనుకుంటున్నాడు. ఇక్కడ మనకి ఎంతో సుదీర్ఘకాలం నుంచి సాంప్రదాయికంగా మూర్ఖులు - ఎవరైతే తమని తాము అర్పణ చేసుకోవాలనుకున్నారో, ఏదైతే లేదో దానిగా మారాలనుకున్నారో, ఇక్కడ గర్వంతో కాకుండా కేవలం ఇక్కడ మట్టిలాగ ఈ భూమిలాగా ఉండాలనుకున్నారో అలాంటివారు ఉన్నారు. శివుడు, ఈ మూర్ఖులు ఈ ప్రపంచంలో మనలేరు అని తెలుసుకొని, వారందరినీ కూడా ఆయన ఆలింగనం చేసుకున్నారు. ఆయన వారందరినీ కూడా తానుగా కలిపేసుకున్నారు. వారి చాతుర్యంవల్ల కాకపోయినా, కేవలం వారి మూర్ఖత్వం వల్ల వారు అనుగ్రహ పాత్రులు ఆయారు.

మీరు దేనికైనా సరే, ఎంతో సరళంగా వున్నదానికి వంగి నమస్కరించడం అన్నది ఒక శక్తివంతమైన సాధనం. మీరు విపరీతమైన తెలివిగల వారిగా, శక్తివంతమైన వారిగా ఉండడం వల్ల, మీకు ఎన్నో ద్వారాలు తెరుచుకోవచ్చు. లేదా ప్రజలు వారి కారుణ్యం వల్ల మీకు ద్వారాలు తెరవవచ్చు. కానీ మనకి ఒక గొప్ప సాంప్రదాయామే ఉంది. ఇందులో ఎంతో మంది వారు ఎలాగో ఒకలా పాకినా పర్వాలేదు... వారు దీనిని దాటాలనుకున్నారు. వీరికి ఎటువంటి లజ్జా లేదు, సిగ్గు అన్న భావన లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. ఈర్ష్య అసలే లేదు, గర్వం లేదు, అహంకారం లేదు – అసలు ఏమీ లేదు. వారికి ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఇటువంటి వారు ముక్తి పొందారు.

ఎవరికి భక్తిగా వున్నారు, దేనికి భక్తిగా ఉన్నారు - అన్నది విషయం కాదు. ఎక్కడైతే ఒక భక్తుడు ఉంటాడో అక్కడ భగవంతుడు ఉంటాడు. భక్తికి ఉన్న శక్తి అటువంటిది. అది సృష్టి-కర్తని సృష్టించగలదు. మనం, దేనినైతే భక్తి అంటున్నామో - భగవంతుడిని సృష్టిలోకీ, మనుగడలోకీ తీసుకు రాగలిగిందే భక్తి.

Tags:    

Similar News