Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశి వారికి వివాదాలు పరిష్కారం!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

Update: 2021-02-20 00:06 GMT

20-02-2021 రాశి ఫలాలు 

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 20 ఫిబ్రవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం | మాఘ మాసం | శుక్లపక్షం | అష్టమి 13:33:13 వరకు తదుపరి నవమి | రోహిణి నక్షత్రం పూర్తిగా | వర్జ్యం 07:27:05 నుండి 08:13:42 వరకు | అమృత ఘడియలు 12:06:45 నుండి 12:53:22 వరకు | దుర్ముహూర్తం 06:40:28 నుండి 07:27:05, 07:27:05 నుండి 08:13:42 వరకు | రాహుకాలం 09:35:16 నుండి 11:02:40 వరకు | సూర్యోదయం: 06:40:28 | సూర్యాస్తమయం: 18:19:39

ఈరోజు రాశి ఫలాలు


మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. బంధువర్గం నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం: బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్య సమాచారం రాగలదు. ఆప్తులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవదర్శనాలు.

కర్కాటకం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు.

సింహం: కొత్త ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య: సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు. పనుల్లో విజయం. కొన్ని వివాదాలు పరిష్కారం.. బంధువుల నుంచి ధనలాభం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

తుల: బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

వృశ్చికం: బంధువులతో కొన్ని వివాదాలు. ఆరోగ్యభంగం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. దైవదర్శనాలు. .

ధనుస్సు: ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి. దూరపు బంధువుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వాహనయోగం.

మకరం: కొత్త పనులు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు కొంత తగ్గుతాయి.

కుంభం: రుణయత్నాలు చేస్తారు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మీనం: ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. బంధువర్గంతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

Tags:    

Similar News