Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 11 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

Update: 2020-10-11 01:49 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 11 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి: మ.12.05 తదుపరి దశమి | పుష్యమి నక్షత్రం రా.8-59 తదుపరి ఆశ్లేష | వర్జ్యం: ఉ.శే.6-30 వరకు | అమృత ఘడియలు: మ.2-32 నుంచి 4-09 వరకు | దుర్ముహూర్తం: సా.4-05 నుంచి 4-52 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6.00 వరకు | సూర్యోదయం: ఉ.5-55 సూర్యాస్తమయం: సా.5-39

ఈరోజు రాశి ఫలాలు


మేషం: పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయపడతారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. వాహనయోగం. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మిథునం: మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో వివాదాలు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తు,వస్త్రలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మీనం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

Tags:    

Similar News