Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 08 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

Update: 2020-11-08 01:13 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 08 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అష్టమి రా.1-21 తదుపరి నవమి | ఆశ్లేష నక్షత్రం తె.4-30 తదుపరి మఖ | వర్జ్యం సా.5-24 నుంచి 6-59 వరకు | అమృత ఘడియలు రా.2-54 నుంచి 4-29 వరకు | దుర్ముహూర్తం ఉ. సా.3-53 నుంచి 4-38 వరకు | రాహుకాలం సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.06-05 | సూర్యాస్తమయం: సా.05-24

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.

వృషభం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుపడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.

మిథునం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం:రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: శ్రమ òపెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

Tags:    

Similar News