నిజమైన భక్తి ఎలా ఉంటుంది?

Update: 2019-08-14 07:09 GMT

పూజలు, వ్రతాలు నోములు చేయటం భక్తి కాదు. భక్తి సాధనాలు, భక్తిని సాధించటానికి వంటపట్టించుకోటానికి చేసే అభ్యాసాలు అభిషేకాలు, ఆరాధనలు, అర్చనలు, నైవేధ్యాలు, ఉపవాసాలు, పారాయణాలు జాగరణలు భక్తి కాదు. అవి కూడా భక్తి సాధనకు ఉపయోగడే సాధనాలు. ఉపకరణాలు. సాధారణంగా, స్థూలంగా మనం రెండూ ఒకటే అనుకుంటుంటాం. అనుకుంటున్నాం.

భక్తి అంటే ఏమిటి? భగవంతుడ్ని ప్రేమించటం భక్తి. భగవంతుడి కోసం అర్రులు చాచటం భక్తి. ఆరాట పడటం భక్తి. భగవంతుని కోసం ఏడ్వటం భక్తి. బాధ పడటం భక్తి. భగవంతుడికి అన్నీ ఆర్పణ చేయటం భక్తి. కష్టంలోను, కన్నీళ్లలోను, బాధలలోను ప్రతి స్థితిలోను ప్రతీ పరిస్థితిలోను, ప్రతి అవస్థలోను వ్యవస్థలోను, అన్నిటిలోను, అంతటిలోను భగవంతుడ్ని చూడగలగటమే భక్తి. అనుక్షణం ప్రతిక్షణం అనువణువునా ఆ భగవంతుడ్ని హృదయంలో ఉంచుకోగలగటం భక్తి. భగవంతుడి కోసం వేదన పడటం భక్తి. రోదన చేయటం, భగవంతుడ్ని అనుభవించటం భక్తి. అనుభవంలోకి తెచ్చుకోవటం భక్తి.

Tags:    

Similar News