శివుడునినే తన పతిగా భావిస్తూ, తన పుట్టుక మహేశ్వరడుకే అని ఎన్నో ప్రవచనాలు ఇస్తూ ఉండేది.. ఇలా ఇస్తూనే మహాదేవి నుండి అక్కమహాదేవిగా మారింది. అక్క మహాదేవి సాక్షాత్తు పార్వతీదేవి రూపము, మల్లికార్జునిడి యొక్క అనుగ్రహముతో జన్మించినది. ఈమె కర్ణాటక రాష్ట్రములోని ఉడుతడి గ్రామంలో సుమతి మరియు నిర్మలశెట్టి దంపతులకు జన్మించినది. సుమతి శైవభక్తురాలు ఆమె సంతానం కోసం శివుడిని ప్రార్థిదింపగా ఆయన అంశతో కూడిన ఒక ఆడపిల్లకు జన్మను ఇస్తావని వరాన్ని ఇస్తారు. మహేశ్వరుని అంశతో పుట్టిన పాపకు మహాదేవి అని నామకరణాన్ని చేసారు ఆ దంపతులు. అయితే మహాదేవి ఎంతో సౌందర్యరాశి, గుణవంతురాలు, పిల్లలకు పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన అమ్మాయిగా పెరగసాగింది. తన వయస్సుతో పాటుగానే బోళా శంకరణుని మీద ఇష్టాన్ని కూడా పెంచుకుంది ఆమె.. ప్రతిరోజూ పిల్లలకు పెద్దలకు శివపురాణము గురించి శివుడు పార్వతులగురించి వివరించే మహాదేవిని వారు అంతా అక్కమహాదేవిగా పిలిచేవారు. శివుడునినే తన పతిగా భావిస్తూ ప్రతిరోజూ ఆయన్ని వేడుకునేది.
శ్రీశైలపు అడవులలో కూర్చుని తపస్సుచేస్తున్న మహాదేవికి అక్కడ ఉన్న బసవేశ్వరుడు దగ్గరలో ఉన్న శివక్షేత్రములో తనకు నివాసము దొరుకుతుందని, అక్కడ ఉన్న గుహలో శివయ్యకు తపస్సుని చేయమని చెప్పగా, ఆమె శ్రీశైలానికి చేరుకొని అక్కడే భోళాశంకరుడికి తపస్సును చేస్తూ, కదళీవనములో ఉన్న జ్యోతిర్లింగ మల్లికార్జునుడిలో ఐక్యమైపోయింది. ఆ గుహ పేరు ఇప్పటికి అక్కమహాదేవి గుహాగా ప్రఖ్యాతి చెందుతోంది. ఆమె విగ్రహము ఇప్పటికి మల్లికార్జుని గుడిలో ఉన్న మర్రిచెట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్షమాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది. ఈమె ఎన్నో రచనలను రచించినది. అన్నిటిలో.. "చెన్న కేశవా" అనే పదముతో తన రచనను ముగించేదిగా స్థలపురాణము చెబుతోంది.