అమ్మవారిని ఆదివారం దర్శించుకున్న భక్తులు లక్షా ఏభై వేల మంది

ఘనంగా విజయవాడ కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృతిలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

Update: 2019-09-30 07:17 GMT

ఘనంగా విజయవాడ కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృతిలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భముగా అమ్మవారిని లక్ష 50వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో సురేష్ బాబు తెలిపారు. దసరా మహోత్సవాల మొదటి రోజు 36 లక్షల రూపాయాల ఆదాయం వచ్చినట్టు ఆయన చెప్పారు. గత ఏడాది 26 లక్షల రూపాయల ఆదాయం మొదటి రోజు వచ్చిందని సురేష్ బాబు వివరించారు. లడ్డు విక్రయాల ద్వారా 53 వేల రూపాయల ఆదాయం సమకూరింది ఈవో చెప్పారు. అలాగే, పులిహోర ప్రసాదం ద్వారా 35 వేలు ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం 2420 మంది తలనీలాలు సమర్పించారనీ, 15 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారనీ అయన తెలిపారు.  

Tags:    

Similar News