Solar Eclipses In 2024: 2024లో 2 సూర్యగ్రహణం వస్తున్నాయి.. ప్రభావం ఎలా ఉంటుందంటే..?

Solar Eclipses In 2024: డిసెంబర్‌ నెల తర్వాత 2024 సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు సంభవిస్తాయి.

Update: 2023-11-22 15:30 GMT

Solar Eclipses In 2024: 2024లో 2 సూర్యగ్రహణం వస్తున్నాయి.. ప్రభావం ఎలా ఉంటుందంటే..?

Solar Eclipses In 2024: డిసెంబర్‌ నెల తర్వాత 2024 సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు సంభవిస్తాయి. కానీ ఇవి ప్రపంచంపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. 2024లో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు వస్తాయి. ఈ సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు ఎప్పుడు సంభవిస్తాయి? అలాగే వాటి ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుది. మొదలైన విషయాలు ఈ రోజు తెలుసుకుందాం.

2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న జరుగుతుంది. ఈ సూర్యగ్రహణం రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 39 నిమిషాలు ఉంటుంది. ఈ గ్రహణం నైరుతి యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధృవంలో కనిపిస్తుంది. 2024 సంవత్సరంలో వచ్చే మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్‌ భారత్‌పై ఉండదు.

రెండో సూర్యగ్రహణంఅక్టోబర్ 2, 3 రాత్రి వస్తుంది. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2న రాత్రి 9:13 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:17 గంటలకు ముగుస్తుంది. రెండవ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 6 గంటల 4 నిమిషాలు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం అమెరికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. కాబట్టి దీని ఎఫెక్ట్స్‌ కూడా భారత్‌పై ఉండదనే చెప్పాలి.

Tags:    

Similar News