ఆధ్యాత్మికతను పెంచే మార్గాలేంటి?

Update: 2019-08-10 06:28 GMT

ఆధ్యాత్మికత అనేది భక్తిని వ్యక్తపరిచే సాధనం మాత్రమే కాదు. జీవన విధానాన్ని తీర్చిదిద్దే మహత్తరమైన శక్తి దీనికుంది. ఆధ్యాత్మిక పథంలో సాగడం వల్ల మానసిక ఆనందంతో పాటు భౌతిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక భావనను నిలుపుకోవడం కాస్త కష్టమైన పనే. ఇష్టంగా సాధన చేస్తే ఇదేం అసాధ్యమైన విషయం కాదు. ఈ సూచనలు పాటించి చూడండి. మీలో ఆధ్యాత్మిక భావాన్ని పెంచుకోండి. ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేసే సాహిత్యాన్ని చదవండి. అయితే వాటిని చదవడంతోనే వదిలేయకుండా అందులోని అంశాలను పాటించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజూ ధ్యానం చేయండి.

ధ్యానం అంటే తపస్సు కాదు. ఓ పదిహేను నిమిషాలు మనసును ఒకేచోట కేంద్రీకరించే ప్రయత్నం. మనసును అలా నిలపడం చాలా కష్టం. కానీ, సాధన చేస్తే అసాధ్యమేమీ కాదు. ఆధ్యాత్మికంగా మీలో కలుగుతున్న భావాలను గుర్తించే ప్రయత్నం చేయండి. మీ ప్రవర్తన, మీ మాటతీరులో ఎలాంటి మార్పులు ఏర్పడుతున్నాయో గమనించండి. దీనివల్ల మీకు కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో సాగడానికి శారీరకంగా శ్రమపడాల్సిన అవసరం లేదు. మానసిక ఒత్తిళ్లూ ఉండవు. అయినా చాలామంది రెండు రోజులు ధ్యానం చేశారో లేదో.. నాలుగు రోజులు ఆ దిశగా ప్రయత్నం చేయరు. ప్రతి ఉదయం ధ్యానం చేయడం అలవాటుగా చేసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అప్రయత్నంగానే మీలో ఓపిక, శాంత స్వభావం పెరగడం గమనించవచ్చు. పాజిటివ్‌ థింకింగ్‌ పెరుగుతుంది. 

Tags:    

Similar News