టాప్-6 న్యూస్ ఆఫ్ ది డే.. ( 15/06/2024 )

టాప్-6 న్యూస్ ఆఫ్ ది డే.. ( 15/06/2024 )

Update: 2024-06-15 13:13 GMT

టాప్-6 న్యూస్ ఆఫ్ ది డే.. ( 15/06/2024 )



1.విద్యుత్ కొనుగోలు విషయమై జస్టిస్ ఎల్. నరసింహరెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు 12 పేజీల లేఖను రాశారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్నారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని ఆ లేఖలో ఆయన ఆరోపించారు.


2. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ సంకీర్ణ ప్రభుత్వానికి సంపూర్ణ బలం లేదని అది ఎప్పుడైనా కూలిపోవచ్చన్నారు. కానీ, ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని ఆయన చెప్పారు.


3. కేరళ త్రిస్సూర్ కలెక్టర్ గా పనిచేస్తున్న తెలుగు ఐఎఎస్ కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. బాలల హక్కుల పరిరక్షణకు ఆయన పనిచేశారు. కరోనా, కేరళ వరదల సమయంలో ఆయన చేసిన సేవలు ప్రశంసలు పొందాయి. ఐఎఎస్ కృష్ణతేజకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 


 4. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. రోడ్డుకు అడ్డుగా నిర్మాణాలున్నాయని ఫిర్యాదు అందడంతో తొలగించారు.


5. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. రిషికేష్-బద్రీనాథ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. 


6. తెలంగాణలో 20 మంది ఐఎఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఎన్నికల ఫలితాల తర్వాత పాలనపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కొత్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. పాలనలో తన మార్కును చూపించే దిశగా సీఎం చర్యలు ప్రారంభించారు. 

Tags:    

Similar News