డిసెంబర్ లో ఆకాశంలో అరుదైన అద్భుతం.. మిస్ అయితే మళ్ళీ చూసే ఛాన్స్ ఉండదు!

అరుదైన దృశ్యాలు చూడటం.. వాటి గురించి మాట్లాడుకోవడం ఓ అందమైన అనుభవం. ముఖ్యంగా సౌర కుటుంబం.. రోదశి.. ఇలాంటి విషయాల్లో ఆసక్తి ఉన్నవారికి కొన్ని అద్భుతాలు చూడటం సరదాగా ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..త్వరలోనే వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం కనబడబోతోంది. అదేమిటో తెలుసుకుందాం.

Update: 2020-11-22 07:14 GMT

Jupitor and Saturn together (Image credit: SkySafari app)

మన విశ్వం ఎన్నో అద్భుతాల సంగమం. సౌరకుటుంబం గురించి తెలుసుకునే కొలదీ ఎన్నో అద్భుతాలు కనిపిస్తూనే ఉంటాయి. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరగడం.. వాటి కక్ష్యల్లో అవి తిరుగుతూనే ఒక్కోసారి దగ్గరగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే, ఇలా రెండు గ్రహాలు సమీపంగా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అటువంటి సందర్భాలు మిస్ అయితే మళ్ళీ జీవితకాలంలో చూడలేకపోవచ్చు. అరుదైన దృశ్యాలు చూడటం.. వాటి గురించి మాట్లాడుకోవడం ఓ అందమైన అనుభవం. ముఖ్యంగా సౌర కుటుంబం.. రోదశి.. ఇలాంటి విషయాల్లో ఆసక్తి ఉన్నవారికి కొన్ని అద్భుతాలు చూడటం సరదాగా ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..త్వరలోనే వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం కనబడబోతోంది. అదేమిటో తెలుసుకుందాం.

స్పేస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఇస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 21 వ తేదీన ఆకాశంలో ఓ అద్భుతం చోటు చేసుకోబోతోంది. అదేమిటంటే.. తొలిసారి శని బృహస్పతి రెండుగ్రహాలు కలిసి ఒకేచోట డబుల్ ప్లానెట్ గా దగ్గరగా కనిపించ నున్నాయి. డిసెంబర్ 21న సాయంత్రం సూర్యాస్తమయం 6 గంటల తరువాత ఈ అరుదైన దృశ్యాన్నిటెలిస్కోప్ ద్వారా చూడవచ్చు. భూమిపై నుంచి రాత్రి ఆకాశంలో చూస్తే బృహస్పతి శని గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా కనిపిస్తాయి. ఇలా ఈ రెండు గ్రహాల మధ్య కలయిక చాలా అరుదుగా సంభవిస్తుంటుంది. 1226 సంవత్సరంలో మార్చి 4న తెల్లవారుజామున ఆకాశంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది.

అయితే, ఇదేమీ అకస్మాత్తుగా జరుగుతున్న సంఘటన కాదు. ఈ వేసవి కాలం నుంచి ఈ రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తున్నాయి. డిసెంబర్ 21 నాటికి వాటిమధ్య దూరం చాలా తగ్గిపోతుంది. పూర్తి చంద్రుని వ్యాసంలో 1/5వ వంతు మాత్రమే వేరుగా కనిపిస్తాయని భౌతిక శాస్త్ర ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ హర్తిగాన్ అన్నారు. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు.

భూమధ్యరేఖకు సమీపంలో ఉన్నప్పటికీ.. ఈ దృశ్యం భూమిపై ఎక్కడైనా కనిపించవచ్చు. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఒక గంట పాటు పశ్చిమ ఆకాశంలో గ్రహ ద్వయం తక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. సంధ్యా సమయంలోనూ గ్రహాలను చూడగలిగేంత ప్రకాశవంతంగా ఉంటాయని చెబుతున్నారు. అమెరికాలో ఉండేవారికి ఈ అరుదైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యాస్త సమయానికి ఒక గంట తరువాత న్యూయార్క్ లేదా లండన్ లో ఆకాశంలో ఈ రెండు గ్రహాలను వరుసగా 7.5 డిగ్రీలు 5.3 డిగ్రీల కోణంలో దగ్గరగా చూడొచ్చు. ఈ రెండు గ్రహాలు మళ్లీ 2400 సంవత్సరం తర్వాత ఒకే చోట కనిపించే అవకాశం ఉంది. 


Tags:    

Similar News