Indian Railways: ఒకే టిక్కెట్‌పై 56 రోజులు ప్రయాణించవచ్చని తెలుసా.. ఏ క్లాస్‌లోనైనా జర్నీ చేయోచ్చు..!

Indian Railways: భారతీయ రైల్వేలు ప్రయాణీకుల సౌకర్యార్థం అనేక నియమాలను రూపొందించాయి. వాటిలో ఒకటి మీరు ఒకే టిక్కెట్‌పై 56 రోజులు ప్రయాణించవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Update: 2023-09-03 02:45 GMT

Indian Railways: ఒకే టిక్కెట్‌పై 56 రోజులు ప్రయాణించవచ్చని తెలుసా.. ఏ క్లాస్‌లోనైనా జర్నీ చేయోచ్చు..!

Indian Railways: దేశంలో ఎక్కువ మంది ప్రయాణికులు రైల్వే ద్వారానే ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం ఇతర మార్గాల కంటే సులభంగా పరిగణిస్తుంటారు. మీరు కూడా రైల్వేలో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు కొన్ని నియమాల గురించి తెలుసుకోవాలి. ఇవి మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. అదేవిధంగా మేం రైల్వే అందిస్తోన్న ప్రత్యేక టిక్కెట్ గురించి చెప్పబోతున్నాం. దీనిపేరే సర్క్యులర్ జర్నీ టికెట్ . ఈ టికెట్ సహాయంతో మీరు చాలా రోజుల పాటు చాలా దూరం ప్రయాణించవచ్చు.

సర్క్యులర్ జర్నీ టికెట్ అని పిలిచే ప్రత్యేక టిక్కెట్‌ను రైల్వే జారీ చేస్తుంది. ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ ద్వారా, ఎనిమిది వేర్వేరు స్టేషన్ల నుంచి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు అనేక స్టేషన్లలో ఎక్కవచ్చు. మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. చాలా మంది యాత్రికులు లేదా యాత్రికులు ఈ టిక్కెట్‌ను ఉపయోగిస్తారు. ఏ తరగతిలోనైనా ప్రయాణానికి సర్క్యులర్ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.

సర్క్యులర్ జర్నీ టికెట్ అంటే ఏమిటి..

ఇందులో ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెడితే అక్కడితో ప్రయాణాన్ని ముగించవచ్చు. మీరు సికింద్రాబాద్ నుంచి మీ ప్రయాణాన్ని ప్రారంభించి, న్యూఢిల్లీ చేరుకోవాల్సినట్లయితే, ఆ తర్వాత న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వరకు తిరిగి రావచ్చు. సర్క్యులర్ జర్నీ టికెట్ టిక్కెట్లను నేరుగా కౌంటర్లో కొనుగోలు చేయలేరు. దీని కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి. దీనితో పాటు, మీరు మీ ప్రయాణ మార్గం గురించి పూర్తి సమాచారాన్ని అందించాలి.

ఈ టికెట్ ఎన్ని రోజులు చెల్లుబాటు అవుతుందంటే?

సర్క్యులర్ జర్నీ టికెట్ 56 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి, మీ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో ప్రయాణికులు గుర్తుంచుకోవాలి. ఈ ప్రయాణం కూడా అక్కడితో ముగించాల్సి ఉంటుంది.

ఈ టికెట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సుదూర ప్రయాణంలో సర్క్యులర్ జర్నీ టికెట్ తీసుకోవచ్చు. మీరు సర్క్యులర్ జర్నీ టిక్కెట్లు కొనుగోలు చేస్తే, టిక్కెట్లు పొందడానికి స్టేషన్లలో పదే పదే దిగాల్సిన అవసరం ఉండదు. సర్క్యులర్ టిక్కెట్‌తో, మీ సమయం కూడా ఆదా అవుతుంది. టికెట్ కూడా చౌకగా ఉంటుంది.

Tags:    

Similar News