Major UnniKrishnan: ఇండియన్ రైల్వేస్ ఘన నివాళి.. రైలుకి ఉన్నికృష్ణన్ పేరు
Major UnniKrishnan: మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్..ఈ పేరు వింటే చాలు భారతీయుల గుండె ఉప్పొంగుతుంది.
Major UnniKrishnan: మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్..ఈ పేరు వింటే చాలు భారతీయుల గుండె ఉప్పొంగుతుంది. పది మంది పాకిస్తానీ టెర్రరిస్టులు పిస్టళ్లు, ఏకే47లు, బాంబులు, గ్రెనేడ్లు ఇతర పేలుడు పదార్థాలతో ముంబయి పై విరుచుకుపడి..మారణహోమం సృష్టించారు. తాజ్ ప్యాలెస్ లో విదేశీయులను బందీగా చేసుకున్నారు. 60 గంటల పాటు కొనసాగిన ఉగ్రదాడుల్లో 160 మందకి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.
తాజ్ ప్యాలెస్ లో నక్కిన ఉగ్రవాదులను ఏరి వేసేందుకు NSG రంగంలోకి దిగింది. ఈ టీమ్ లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. గదిలో చిక్కుకున్న ఓ మహిళా ఉద్యోగిని సేఫ్ గా తీసుకొచ్చే క్రమంలో ఓ ఉగ్ర బుల్లెట్ ఉన్ని కృష్ణన్ శరీరంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కూడా ఆయన తన సహచరుల గురించే ఆలోచించారు. ఎవరు ముందుకురావద్దని వాకీటాకీ ద్వారా మిగతావారిని హెచ్చరించారు. అలా పౌరుల్ని, తన తోటి కమాండోలను, దేశ సమగ్రతను కాపాడే క్రమంలో సందీప్ ఉన్ని కృష్ణన్ వీరమరణం పొందారు. భారతీయుల గుండెల్లో అమరుడిగా నిలిచాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ బలిదానానికి భారతీయ రైల్వే ఘనమైన నివాళి అర్పించింది. టీకేడీ డబ్ల్యూడీపీ 48 40049 రైలుకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అశోక చక్ర అని నామకరణం చేసింది.
ఉన్ని కృష్ణన్ ప్రాణ త్యాగాన్ని గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర బిరుదునిచ్చి సన్మానించింది. తాజాగా భారతీయ రైల్వే ఓ రైలుకు ఆయన పేరు పెట్టి ఘనమైన నివాళి అర్పించింది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో అడవిశేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శశికుమార్ మేజర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది.