Astro News: ఉదయాన్నే పూజలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు..!
Astro News: హిందూ మతంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
Astro News: హిందూ మతంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే సరిగ్గా చేసే పూజలు మాత్రమే శుభ ఫలితాలని అందిస్తాయి. ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. కానీ ఒక్కొక్కరి పూజా విధానం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే చాలామంది పూజ చేసేటప్పుడు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల శుభ ఫలితాలకి బదులు చెడు ఫలితాలు కలుగుతాయి. పూజ చేసేటప్పుడు ఏయే విషయాలను దృష్టిలో ఉంచుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.
సరైన దిశలో పూజించండి
సరైన దిశలో పూజలు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఇంట్లో పూజా స్థలం లేదా దేవాలయం ఈశాన్య దిశలో ఉండాలి. పూజకు ఈ దిక్కు అత్యంత శుభప్రదమని నమ్ముతారు. పూజ చేసేటప్పుడు ముఖాన్ని పడమర వైపు ఉంచండి.
సూర్యుడికి ప్రార్థనలు
భక్తులకు రోజువారీ దర్శనం ఇచ్చే ఏకైక దేవుడు సూర్య దేవుడు. ఉదయాన్నే ఆయనకు అర్ఘ్యం సమర్పించడం చాలా పవిత్రమైనది. దీనివల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది గౌరవం కూడా పెరుగుతుంది.
ఆసనం వేయాలి
పూజ చేసేటప్పుడు నేలపై కూర్చోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజా సమయంలో తప్పనిసరిగా ఆసనం వేయాలని చెబుతారు. ఇది మీ పూజను అర్ధవంతం చేస్తుంది. ఇంటి నుంచి పేదరికాన్ని తొలగిస్తుంది.
దీపం వెలిగించాలి
ఇంటి నుంచి ప్రతికూలతను తొలగించడానికి శుభ ఫలితాలు పొందడానికి ఉదయం, సాయంత్రం ఆలయంలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల భగవంతుడు తన అనుగ్రహాన్ని భక్తునిపై ఉంచుతాడని విశ్వాసం.