Indian Railway: తక్కువ ఖర్చుతో అండమాన్, నికోబార్ టూర్.. 6 రోజులు, 5 రాత్రులు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ఆఫర్..!
IRCTC Tour: IRCTC భారతీయ రైల్వే ప్రయాణీకుల కోసం ఎప్పటికప్పుడు వివిధ రకాల టూర్ ప్యాకేజీలను అందిస్తూనే ఉంది. తాజాగా మీకోసం ఓ అద్భుతమై టూర్ గురించి చెప్పబోతున్నాం.
IRCTC Andaman Tour Package: IRCTC భారతీయ రైల్వే ప్రయాణీకుల కోసం ఎప్పటికప్పుడు వివిధ రకాల టూర్ ప్యాకేజీలను అందిస్తూనే ఉంది. తాజాగా మీకోసం ఓ అద్భుతమై టూర్ గురించి చెప్పబోతున్నాం. ఎంతో తక్కువ ధరలో అండమాన్, నికోబార్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అండమాన్ సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీ కోసం IRCTC ఒక ప్రత్యేక ప్లాన్‌తో ముందుకు వచ్చింది.
ఈ ప్యాకేజీ ద్వారా, మీరు ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 16 వరకు అండమాన్‌ను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ మొత్తం 6 రోజులు, 5 రాత్రులుగా ఉంటుంది.
అయితే ఇది కోల్‌కతా నుంచి అందుబాటులో ఉంది. అంటే మీరు కోల్‌కతా నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు విమానంలో టిక్కెట్టు సౌకర్యం పొందుతారు.
ఇందులో, మీరు పోర్ట్ బ్లెయిర్‌తో పాటు హేవ్‌లాక్, నీల్ ద్వీపాలను సందర్శించే అవకాశం కూడా పొందుతారు.
మొత్తం 6 పగలు, 5 రాత్రులు మీరు అన్ని ప్రదేశాలలో రాత్రిపూట బస చేయడానికి హోటల్ సౌకర్యాలను పొందుతారు. దీనితో పాటు అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు టూరిస్ట్ బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
దీనితో పాటు, పర్యాటకులు పోర్ట్ బ్లెయిర్ హేవ్‌లాక్, నీల్ ఐలాండ్‌లో లగ్జరీ క్రూయిజ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు.
ప్రయాణీకులందరూ IRCTC నుంచి ప్రయాణ బీమా ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ టూర్‌లో సింగిల్‌గా వెళితే రూ.53,400లు ఛార్జ్ చేయనున్నారు. అలాగే ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.40,900లు, ముగ్గురు వ్యక్తులు రూ.39,600లు చెల్లించాల్సి ఉంటుంది.