Special focus on TTD: తిరుమలలో కరోనా వ్యాప్తి.. తక్షణ కర్తవ్యం ఏమిటి? స్పెషల్ ఫోకస్!
special focus on ttd: శ్రీవారి సేవలో ఉండే అర్చకులకు కరోనా సోకుతోంది. ఈ పరిస్థితిలో టీటీడీ ఏం చేయబోతోంది?
కరోనా మహమ్మారి దైవాన్ని కూడా దూరం చేసేస్తోంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశ పడతారు. అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలతో తిరుమల కొండెక్కి మొక్కులు తీర్చుకుంటారు. అయితే, కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి భక్తులు కొద్దిరోజులు పూర్తిగా దూరం అయిపోయారు. కొన్నాళ్ళ క్రితం వేంకటేశుని దర్శనానికి అనుమతి ఇచ్చారు. పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
ఈ నేపధ్యంలో తిరుమలకు భక్తుల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. మొదట వారం బాగానే నడిచింది. తరువాత కరోనా కన్ను తిరుమల మీద పడింది. ఏకంగా శ్రీవారి అర్చకుల మీదే కరోనా విరుచుకు పడుతోంది. దీంతో పలువురు అర్చకులు అనారోగ్యం బారిన పడ్డారు. ఇప్పుడు తిరుమలలో దర్శనాల కొనసాగింపు పై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరి టీటీడీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది అనేదే పెద్ద ప్రశ్న. ఎదుకొండల్లో ఏం జరుగుతోంది.. పాలక మండలి నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్ ఈరోజు (జూలై 20 సోమవారం) రాత్రి 10:00 గంటలకు మీ HMTV లో.. తప్పకుండా చూడండి!