సుందర శిల్పాలు. అపురూప నమూనాలు. అబ్బురపరిచే స్థంభాలు... స్థలపురాణం చాటే కళలు. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామయ్య మందిరానికి పునాదిరాయి పడిన సందర్భమిది. శతబ్దాల నిరీక్షణకు తెరదించేసిన సమయమిది. తాను పుట్టిన పెరిగిన నేలపై కొన్ని వందల సంవత్సరాల పాటు తనకంటూ ఓ గుడి కూడా లేకుండా అరణ్యవాసం చేస్తున్న రామయ్యకు ఓ కోవెలను కడుతున్న విశేషమిది. అవును అయోధ్యా రామయ్య ఓ ఆలయంవాడు కాబోతున్నాడు.