పాపం తెలుగు టైటాన్స్.. చేజేతులా విజయాన్ని టై గా మార్చుకున్నారు!

Update: 2019-08-03 05:39 GMT

విజయం కోసం మొహంవాచిపోయిన వాళ్లకు ఒక్క విజయం దక్కితే ఏం చేస్తారు? ఎగిరి గంతేస్తారు. కాదు..కాదు..గెంతులేస్తూ ఎగిరెగిరి పడతారు. పాపం వాళ్ళూ అదే చేశారు. దాంతో బొటాబొటీగా దక్కిన ఆవిజయం కూడా దూరమై లబోదిబో అన్నారు. ఇదీ ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లలో తెలుగు టైటాన్స్ నిర్వాకం.

ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో యూపీ యోధ జట్టుతో డీకొంది తెలుగు టైటాన్స్. మొదట్లో అలాగే ఆడింది కూడా.. 7-3 స్కోరుతో ఆధిక్యం వైపు దూసుకెళ్ళేలా కనిపించింది. అయితే, అక్కడ నుంచి యూపీ యోదా పుంజుకుంది. వరుస పాయింట్లు సాధించి టైటాన్స్ కి చెమటలు పట్టించింది. ఎట్టకేలకు చివరి క్షణాల్లో దేశాయ్ పుణ్యమా అని ఒక్క పాయింట్ తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అంటే.. ఇక మనోళ్లు సంబరాలకు సిద్ధమైపోయారు. రిఫరీ లాంగ్ విజిల్ వేయకముందే గెంతులు వేసుకుంటూ కోర్టులోకి దూసుకువచ్చారు. ఇంకేముంది రూల్స్ ప్రకారం అది పెద్ద తప్పు. దానితో రిఫరీలు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ యోధ జట్టుకు ఇచ్చేశారు. దీంతో టైటాన్స్ జట్టు టీవీ అంపైర్ల సమీక్ష కోరింది. వారు కూడా రిఫరీల నిర్ణయానికే ఒతేయడంతో గెలుపు ఆశలు ఆవిరైపోయి.. మ్యాచ్ ను టైగా ముగించింది.

ముంబై విజయం..

ఇక శుకరవారం జరిగిన రెండో మ్యాచ్ లో ముంబై జట్టు గుజరాత్ జట్టుపై విజయం సాధించి తన వరుస అపజయాలకు కామా పెట్టుకుంది. ముంబై ఆటగాళ్లు సురీందర్‌ సింగ్‌ 9 పాయింట్లతో, అభిషేక్‌ సింగ్‌ 6 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర తో ముంబై జట్టు గుజరాత్ పై 20-32 తేడాతో విజయం సాధించింది.



Tags:    

Similar News