మొదటి మ్యాచ్ లో నిరాశపరిచిన తెలుగు టైటాన్స్..రెండో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ విజయం

Update: 2019-07-20 15:35 GMT

వేట మొదలైంది. నగరంలో కబడ్డీ కూత పెట్టింది. లీగ్ పోటీలు ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో మొదలయ్యాయి. తెలుగు టైటాన్స్ జట్టు యూముంబ జట్టుతో తొలిమ్యాచ్ లో తలబడింది. మరోసారి తెలుగు టైటాన్స్ నిరాశపరిచింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్న తెలుగు టైటాన్స్ మొదటి మ్యాచ్లో శుభారంభం చేయలేకపోయింది. యూముంబ జట్టుతో హోరాహోరీగా పోరాడినా విజయం సాధించలేకపోయింది. ప్రథమార్థంలో యూముంబ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

అయితే, ద్వితీయార్థంలో తెలుగు టైటాన్స్ పుంజుకుని గట్టిగానే ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. దక్కలేదు. తెలుగు టైటాన్స్ రైడర్ రజనీష్ అద్భుత ప్రదర్శన కూడా జట్టును కాపాడలేకపోయింది. ఆరు పాయింట్ల తేడాతో యుముంబా జట్టు విజయాన్ని సాధించింది. యూముంబా జట్టు 31 పాయింట్లు సాధించగా.. తెలుగు టైటాన్స్ 25 పాయింట్లు సాధించి పరాజయం పాలైంది. రజనీష్ తెలుగు టైటాన్స్ తరఫున అత్యధిక రైడ్ పాయింట్లు (7) రాబట్టాడు. యు ముంబా తరఫున అభిషేక్ సింగ్ మొత్తం పది పాయింట్లు రాబట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

బెంగళూరు బుల్స్‌, పట్నా పైరేట్స్‌ మధ్య ఇక్కడే జరిగిన రెండో మ్యాచ్ లో  34-32 తేడాతో బెంగళూరు బుల్స్‌ విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో  చివరికి రెండు పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ కు విజయం దక్కింది. 


Tags:    

Similar News