తెలుగు టైటాన్స్‌ కథ... మళ్లీ మొదటికే..

ప్రొ కబడ్డీ మొదలైన దగ్గరి నుండి తెలుగు బోల్తపడుకుంటూ వస్తునే ఉంది. మధ్యలో మళ్లీ విజయబాట పట్టిన తెలుగు టైటాన్స్ ఇప్పడు మళ్లీ మొదటికే వచ్చేసింది. తాజాగా శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 27–34తో పుణేరి పల్టన్‌ చేతిలో ఘోరపరాజయం చవిచూసింది.

Update: 2019-08-31 05:16 GMT

ప్రొ కబడ్డీ మొదలైన దగ్గరి నుండి తెలుగు బోల్తపడుకుంటూ వస్తునే ఉంది. మధ్యలో మళ్లీ విజయబాట పట్టిన తెలుగు టైటాన్స్ ఇప్పడు మళ్లీ మొదటికే వచ్చేసింది. తాజాగా శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 27–34తో పుణేరి పల్టన్‌ చేతిలో ఘోరపరాజయం చవిచూసింది. ప్రోకబడ్డి లీగ్‌ ఏడో సీజన్‌లో 11వ మ్యాచ్‌ ఆడిన తెలుగు టైటాన్స్‌కి ఇది ఆరో ఓటమికాగా.. పుణెరికి ఇది నాలుగో గెలుపు. ఈ సిజన్‌లో స్టార్ రైడర్ సిద్దార్థను పట్టుబట్టి మరి టీంలోకి తీసుకున్నారు.

కానీ పెద్దగా అయితే మార్పు ఏమీ రాలేదు. సిద్ధార్థ దేశాయ్ 12 సార్లు రైడ్‌కి వెళ్లి 7 పాయింట్లు మాత్రమే తీసుకురాగా.. డిఫెండర్ అరుణ్ ఆరు పాయింట్లతో సాధించినా.. టీమ్‌ని మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 38–35తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. నేడు బెంగళూరు బుల్స్‌తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్, యు ముంబాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తో తలపడనున్నాయి.     

Tags:    

Similar News